సీటు బెల్ట్ ( Seat Belt )పెట్టుకుని చాలా ప్రశాంతంగా స్టీరింగ్ పట్టుకుంది.
ఆ వీడియోలో మీరు చూడొచ్చు.ఎంత ధైర్యంగా కారు నడుపుతుందో, ముందు సీట్లో అమ్మమ్మ, వెనక సీట్లో అమ్మ, చిన్న పాప, పక్కనే అస్వస్థతగా ఉన్న డ్రైవర్ అందరినీ క్షేమంగా గమ్యస్థానానికి చేర్చింది హనీ.
ప్రయాణమంతా డ్రైవర్‌ని పలకరిస్తూనే ఉంది.మధ్యలో సరదాగా "నేను డ్రైవింగ్ ఎలా చేస్తున్నాను?" అని అడిగింది.
డ్రైవర్ కూడా నీరసంగానే నవ్వుతూ "బదియా (చాలా బాగుంది)" అని రిప్లై ఇచ్చాడు.
అప్పుడు హనీ జోక్ చేస్తూ "చూడు బ్రదర్, నీకు బాలేదు కాబట్టి, నేను డ్రైవ్ చేస్తున్నా.
ఫేర్ 50-50 షేర్ చేసుకోవాలి అంతే కదా?" అని నవ్వుతూ అంది. """/" /
మార్చి 18న తీసిన ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
హనీ సమయస్ఫూర్తికి, ఆమె చూపిన దయకు అందరూ ఫిదా అయిపోతున్నారు."ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఇలాంటి సమయాల్లో అది మన ప్రాణాల్ని కాపాడుతుంది" అంటూ హనీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.
హనీ త్వరగా స్పందించడం వల్ల డ్రైవర్‌కి మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
అందుకే ఆమె చాలామంది దృష్టిలో నిజమైన హీరోయిన్‌గా నిలిచింది.
ఎన్ఆర్ఐ భర్తల వేధింపులు.. ఐదేళ్లలో ఎన్ని ఫిర్యాదులంటే?