శరీరంలో జింక్ లోపిస్తే రోజువారి ఆహారంలో ఈ పదార్థాలను తీసుకోవాలా..
TeluguStop.com
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ప్రపంచంలోనే ప్రజలందరికీ ఆరోగ్యం పై ఎక్కువగా శ్రద్ధ పెరిగింది.
మన శరీరంలో కొన్ని రకాల విటమిన్లు తగ్గడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురి అవ్వాల్సి ఉంటుంది.
అలాంటి విటమిన్ల లోపాలలో జింక్ లోపం ఒకటి.ఇది 300 కంటే ఎక్కువ ఎంజైమ్‌ల పనిచేయడానికి సహాయపడుతుంది.
ఈ జింక్ శరీరంలోని చాలా భాగాలు పనిచేయడానికి ఉపయోగపడుతుంది.శరీర కణాల పెరుగుదల, మరమ్మత్తులో కూడా సహాయపడుతుంది.
అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.శరీరం జింక్‌ను నిల్వ చెయ్యలేము,కాబట్టి ఈ పోషకాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి.
జింక్ లోపం వల్ల జుట్టు రాలడం, బరువు తగ్గడం, గాయం మానడం ఆలస్యం కావడం, తరచుగా విరేచనాలు, ఆకలి మందగించడం, మానసిక ఆరోగ్యం బాగాలేకపోవడం వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి.
పాల ఉత్పత్తులలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.ఇందులో జింక్ కూడా ఉంటుంది.
మీరు రోజూ రెండు గ్లాసుల పాలు తాగాలి.అంతే కాకుండా జున్ను తినడం వల్ల కూడా శరీరంలో జింక్ లోపం ఉండదు.
విత్తనాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి జింక్ పుష్కలంగా లభిస్తుంది.దీని కోసం గుమ్మడికాయ, నువ్వుల గింజలను తీసుకోవచ్చు.
వీటిని తినడం వల్ల అనేక ఇతర పోషకాల లోపం కూడా రాకుండా ఉంటుంది.
"""/"/
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.పైన్ నట్స్, జీడిపప్పు, బాదం వంటి గింజలను తినడం వల్ల జింక్ ఎక్కువ గా లభిస్తుంది.
మాంసంలో కూడా జింక్ ఎక్కువ గా ఉంటుంది.ముఖ్యంగా రెడ్ మీట్ జింక్ అవసరాన్ని తీరుస్తుంది.
దీనిని తినడం వల్ల శరీరంలో జింక్ లోపం ఉండదు.కోడిగుడ్లలో కూడా జింక్ ఉంటుంది.
ఇలాంటి చెప్పుంటే ఆహార పదార్థాలు అన్నీ ప్రతిరోజు మన ఆరంభం చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, నాని సినిమాల మధ్య పోటీ.. 2026లో జరగబోయేది ఇదే!