ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది లోపు ఈ పనులు కచ్చితంగా చేయాలి...
TeluguStop.com

ఈ ప్రపంచంలో ఏ ఇంట్లో చూసినా ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు చనిపోయాయి ఉంటారు.


అలా చూస్తే ఈ భూమి మీద ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా చనిపోయే ఉంటారని అందరికీ తెలిసిన విషయమే.


అయితే సాధారణంగా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ ఇంటి కి అనేక రకాల నియమాలను పాటిస్తూ ఉండాలి.
ఇలాంటి నియమాలలో ఎవరైనా ఇంట్లో వారు చనిపోయినప్పుడు కొన్ని నెలల పాటు ఇంట్లో పూజలు చేసుకోవడం అలాగే ఆలయాలకు వెళ్లడం లాంటివి చేయకూడదు.
మరికొందరైతే ఇంట్లో ఉండే దేవుడి పటాలను కూడా ఒకచోట భద్రంగా తీసి ఉంచుతారు.
ఏడాది తర్వాత మళ్లీ ఇంకో పూజలు చేయడం మొదలుపెడతారు.అయితే జ్యోతిష శాస్త్రజ్ఞులు మాత్రం ఇలా చేయడం సరైన పని కాదని అంటున్నారు.
ఎందుకంటే చాలా మందికి ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు ఏమి చేయాలో అనే విషయం తెలియదు.
"""/" /
దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు.
చాలామంది భక్తులు వారి ఇంటిలో భక్తితో దీపం వెలిగిస్తే, అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు అని గట్టిగా నమ్ముతారు.
అందుకే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి.ఎవరైనా చనిపోయిన తర్వాత దీపం వెలిగించకుండా ఉండడం మంచిది కాదు.
అంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 11 రోజులకు దినాలు జరుపుకుంటూ ఉంటారు.
ఆ తరువాత 12వ రోజు నుంచి ప్రతి రోజు నిత్య దీపారాధన చేసుకునే అవకాశం ఉంది.
పండుగలు, ప్రత్యేక పూజలు, శుభకార్యాలు మాత్రం చేయకూడదు.అలాగే ప్రతిరోజు దీపం కూడా పెట్టవచ్చు.
ఇంకా చెప్పాలంటే దేవాలయాలకు వెళ్ళకూడదు అన్న నియమం అయితే ఏమీ లేదు.దేవాలయాలకు వెళ్లిన అర్చనలు, అభిషేకాలు చేయించడం లాంటివి చేయకూడదు.
కొబ్బరికాయ కొట్టకూడదు.కానీ దైవ దర్శనం చేసుకోవచ్చు.
ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు.. ఉగాది పచ్చడి తినడం వల్ల లాభాలేంటి?