అలా అయితే సీటు ఇచ్చేది లేదు ! ఎమ్మెల్యే లకు  జగన్ వార్నింగ్ ?

రాబోయే సార్వత్రిక ఎన్నికలను జగన్ సీరియస్ గానే తీసుకున్నారు.ఇప్పటి నుంచే దానికి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టారు.

నిత్యం ప్రజల్లో ఎమ్మెల్యేలు ఉండాలని , ప్రజా సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను చూపించాలని, పనితీరును మెరుగు పరుచుకోవాలి అని పదే పదే సూచనలు చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో అన్ని ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ.ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని  సూచిస్తున్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు ఎంతో మేలు చేసిందని , అయితే టిడిపి ఆ పార్టీ అనుకూల మీడియా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా వ్యవహారాలు చేస్తున్నాయని,  ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా,  ప్రభుత్వ గ్రాఫ్  మరింత పెంచాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

     తాజాగా నిన్న సాయంత్రం జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం మనం గెలిచిన 151 స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదని,  175 స్థానాలు ఎందుకు మనకి రాకూడదని జగన్ నాయకులను ఉద్దేశించి ప్రశ్నించారు.

పార్టీ అధ్యక్షుడిగా నా గ్రాఫ్ 65 శాతం ఉందని , మీ గ్రాఫ్ 40 నుంచి 45 శాతం లోపే ఉందని దీనిని సరిదిద్దుకోవాలి అంటూ జగన్ సూచించారు.

సర్వే ఆధారంగా ఎమ్మెల్యే టికెట్లు కేటాయింపు ఉంటుందని,  ఓడిపోయే వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదు అంటూ జగన్ తేల్చి చెప్పేసారు.

రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ ఏ మాత్రం బాగా లేదని, ఇటువంటి వారికి ఆరు నెలలు,  తొమ్మిది నెలల సమయం ఇస్తున్నామని ఆ లోగా పనితీరు మెరుగు పరుచుకుని ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ సూచించారు.

        """/" /  ఓడిపోయే ఎమ్మెల్యేల బరువును తాము మోయలేమని అన్నారు.అటువంటి వారికి టికెట్ ఇచ్చేది లేదంటూ  చెప్పారు.

అధికారంలోకి వచ్చాక వారికి ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవులు ఇస్తామని ప్రకటించారు.పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక సైక్లింగ్ పద్ధతిలో జిల్లా అధ్యక్షులు ప్రాంతీయ సమన్వయకర్తలు 25 మంది మళ్లీ మంత్రులు అవుతారని జగన్ వెల్లడించారు.

ప్రస్తుత మంత్రులు రెండు రోజులు మాత్రమే తమ శాఖ బాధ్యతలను చూడాలని మిగిలిన ఐదు రోజులపాటు నియోజకవర్గాల్లో పర్యటించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

  ఎమ్మెల్యేలు,  మంత్రులు రోజుకు రెండు మూడు గ్రామ , వార్డు సచివాలయం సందర్శించాలని జగన్ ఆదేశించారు.

తాను కూడా త్వరలోనే సచివాలయాల ను సందర్శిస్తానని,  నియోజకవర్గాల వారీగా పర్యటిస్తానని జగన్ పర్యటించారు.

ఈ సందర్భంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల పై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు .

ఎవరికైనా పార్టీనే సుప్రీం అని, గీత దాటితే ఎవరిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

నాయకుల మధ్య విభేదాలను సహించేది లేదని,  గ్రూపు రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించను అని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాలను పార్టీ పై రుద్దితే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

టాలీవుడ్ హీరోలపై బోల్డ్ కామెంట్ చేసిన నటి భూమిక.. ఏమన్నారంటే?