పంచ్ ప్రసాద్ నెల సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే?

సాధారణంగా మనం ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడిన లేదా మనలో ఏదైనా చిన్న లోపం ఉన్న ఆ లోపాన్ని పదే పదే తలుచుకొని ఎంతగానో కృంగిపోతాము.

అయితే మరికొందరు మాత్రం ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతుంటారు.కానీ జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నటువంటి కొందరు కంటెస్టెంట్లు వారిలో ఉన్న లోపాన్ని వారి అనారోగ్య సమస్యలను అందరికీ తెలియజేస్తూ ఎంతో పాపులర్ అయ్యారు.

అలా పాపులర్ అయిన వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు.పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో జబర్దస్త్ టీం అతనిని ప్రాణాలతో కాపాడుకున్నారు.

ఇలా జబర్దస్త్ వాళ్ళు చేసిన సహాయం వల్ల వైద్యం చేయించుకొని బ్రతికి బయటపడిన ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ అందరిని నవ్విస్తున్నారు.

లోపల ఎంతో బాధ ఉన్నప్పటికీ బయటకి నవ్వుతూ తన ఆరోగ్యం పై తానే సెటైర్లు వేసుకుంటూ అందరిని కడుపుబ్బ నవ్విస్తున్నారు.

అయితే పంచ ప్రసాద్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో పాటు స్పెషల్ ఈవెంట్లలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇలా కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పంచ ప్రసాద్ నెలకు ఏ మొత్తంలో సంపాదిస్తారనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.

"""/" / ఇకపోతే ఈయన జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం జాతి రత్నాలు అనే కార్యక్రమంలో ద్వారా సందడి చేస్తున్నారు.

ఇలా పలు కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ నెలకు సుమారుగా 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

అయితే తన వైద్య ఖర్చులకోసం నెలకు సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ తన సమస్యను పదేపదే గుర్తు చేసుకొని కృంగిపోకుండా ఇలా అందరి ముందుకు వచ్చి ఆ బాధను మర్చిపోవడమే కాకుండా భారీగా డబ్బును సంపాదిస్తున్నారని చెప్పాలి.

9 నెలల్లో 6 సినిమాలు విడుదల.. ఈ స్టార్ హీరోకు పోటీనిచ్చే మరో హీరో ఉన్నారా?