ఉల్లి, ఉసిరి క‌లిపి ఇలా తీసుకుంటే..ర‌క్త‌హీన‌త ప‌రార్‌!

ఇటీవ‌ల కాలంలో ఎవ‌ర్ని ఆరోగ్యం గురించి అడిగినా ర‌క్తం లేద‌ని చెప్ప‌డం కామ‌న్ అయిపోయింది.

శరీరంలో రక్తం తక్కువగా ఉండట‌మే ర‌క్త‌హీన‌త‌.దీనినే ఎనీమియా అని కూడా అంటారు.

ఈ ర‌క్త హీన‌త స‌మ‌స్య కేవ‌లం ఐర‌న్ లోపం వ‌ల్ల మాత్ర‌మే కాదు విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, జింక్‌‌, రాగి లోపాల‌ వల్ల కూడా ఏర్ప‌డుతుంది.

ఇక ర‌క్త హీన‌త ఉన్న వారు నీర‌సం, అల‌స‌ట‌, క‌ళ్లు తిర‌గ‌డం, ఆయాసం, గుండె దడ, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఛాతి నొప్పి, త‌ల‌నొప్పి ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.

అందుకే ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను ఎంత త్వ‌ర‌గా నివారించుకుంటే అంత మంచిద‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే ర‌క్త హీన‌త‌ను నివారించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాంటి వాటిలో ఉల్లిపాయ మ‌రియు ఉసిరి కూడా ఉన్నాయి.

"""/" / ఉల్లిపాయ‌లో సల్ఫర్, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబ‌ర్ ఇలా ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

అలాగే ఉసిరిలో కూడా విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, కాల్షియం, ఐర‌న్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు ఉంటాయి.

అందువ‌ల్ల ఉల్లి, ఉసిరి ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతారు.

అయితే ఈ రెండూ విడి విడిగానే కాకుండా క‌లిపి తీసుకున్నా మంచిది.ముఖ్యంగా ఉల్లి, ఉసిరి క‌లిపి తీసుకుంటే ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

అర క‌ప్పు ఉల్లి ముక్క‌లు, అర క‌ప్పు ఉసిరి ముక్క‌లు తీసుకుని పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఈ ర‌సంలో కొద్దిగా తేనె క‌లిపి సేవించాలి.ఇలా ప్ర‌తి రోజు తీసుకుంటే ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది.

అలాగే ఈ ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ కూడా పెరుగుతుంది. .

ఐసీసీ అవార్డ్స్ లో దుమ్ములేపిన టీమిండియా ఆటగాళ్లు