విల్ స్మిత్ స్థానంలో నా భర్త ఉంటే అలాగే చేసేవాడు... ఆస్కార్ ఘటనపై స్పందించిన ఖుష్బూ!

ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కమెడియన్ క్రిస్ రాక్ పై చేయి చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నటుడు క్రిస్ రాక్ విల్ స్మిత్ భార్యను అవహేళన చేస్తూ మాట్లాడటంతో ఆయన ఆస్కార్ వేదికపైనే క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించారు.

ఇలా విల్ స్మిత్ తనపై చేయి చేసుకోవడంతో ఒక్క సారిగా ఈ విషయం సంచలనంగా మారింది.

ఇక ఈ ఘటన పై పలువురు ప్రముఖులు స్పందిస్తూ విల్ స్మిత్ కి మద్దతు తెలిపారు.

బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ ఈ ఘటన పై స్పందిస్తూ నేను కనుక విల్ స్మిత్ స్థానంలో ఉంటే తన్నేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఈ ఘటనపై సీనియర్ నటి ఖుష్బూ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ ఆస్కార్ వేదికపై క్రిస్ రాక్ చేసిన వ్యాఖ్యలకు విల్ స్మిత్ చెంపదెబ్బలు సరైనదే అని ఖుష్బూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"""/"/ నేను హింసకు ఎంతో వ్యతిరేకం కాని కామెడీ చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుందని, ఆ హద్దులు దాటి ఎవరు ప్రవర్తించకూడదని ఈమె తెలిపారు.

ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మరొకరు ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేయటం దారుణం.విల్ స్మిత్ స్థానంలో తన భర్త కనుక ఉంటే తాను కూడా అదే పని చేసేవాడని ఈ సందర్భంగా కుష్బూ వెల్లడించారు.

నలుపుదనం పోయి చర్మం తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!