మోదీ అధికారంలోకి వస్తే దేశానికే ముప్పు..: మంత్రి ఉత్తమ్
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
మోదీ ( Modi ) మరోసారి అధికారంలోకి వస్తే యావత్ దేశానికే ప్రమాదమని పేర్కొన్నారు.
దర్యాప్తు సంస్థలతో కలిసి మోదీ ప్రతిపక్షాలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) బీఆర్ఎస్ పోటీలోనే లేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు.
ఈ లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ మిగలదని తెలిపారు.అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 13 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఉనికికి ప్రమాదం వచ్చిందని కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బన్నీ అరెస్ట్ దేనికి సంకేతం.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే!