ఈ కప్పల ముందు నుండి ఫోన్ తీసేస్తే మటాష్

సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.

ఎప్పుడు.ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.

అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.

ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే.వేరే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నెటిజన్లు వాటిని ఎక్కువగా చూస్తారు.లైక్ చేస్తారు.

కామెంట్ చేస్తారు.తాజాగా కప్పలకు చెందిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

సాధారణంగా కప్పలు మనకు బావుల్లోనూ.కుంటల్లోనూ.

చెరువుల్లోనూ కనిపిస్తుంటాయి.అలాంటి కప్పలు సైతం మేము మనిషికి ఎందులోనూ తీసిపోలేము అనిపించేలా సెల్ ఫోన్ ని ని చూస్తూ సందడి చేస్తున్నాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.వీడియోని గమనిస్తే.

ఒక చిన్న నీటి కుంటలాంటి ప్రదేశంలో కొన్ని కప్పలు ఉన్నాయి.ఎవరో ఒక వ్యక్తి అక్కడున్న కప్పల ముందు తన సెల్‌ఫోన్‌లో ఓ వీడియోని ఓపెన్ పెట్టాడు.

ఆ వీడియో కప్పలకు నచ్చినట్లు ఉంది.హాయిగా ఓ లైన్ లో కూర్చుని ఆ వీడియోను వీక్షిస్తున్నాయి.

ఇంతలో ఆ వ్యక్తి వాటి ముందు నుండి ఆ ఫోన్‌ తీసేయడానికి ప్రయత్నించాడు.

అంతే వెంటనే అక్కడ ఉన్న ఓ కప్పు పెద్దగా అరుస్తూ ఆ వ్యక్తి చేతిని కరిచేంతపని చేసింది.

ఈ వీడియో చూసి నెటిజన్లు మనిషే అనుకుంటే.కప్పలు కూడా ఫోన్ కి బానిసలు అయ్యాయిగా.

ప్రకృతిలోని జీవులు కూడా ఫోన్ కి బానిసలుగా మారిపోతున్నాయంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు చూసేయండి.మీ కామెంట్ ను తెలియజేయండి.