కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే..: మాజీ మంత్రి జూపల్లి

బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదన్న ఆయన కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని తెలిపారు.

ప్రగతిభవన్ కాదన్న మాజీ మంత్రి జూపల్లి బానిస భవన్ అంటూ ఎద్దేవా చేశారు.

ఎన్నికలు రాగానే వేషాలు మారుస్తున్నారని విమర్శించారు.కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు రాష్ట్ర అంతటా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కేసీఆర్ పథకాలు అన్నీ ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమేనని మండిపడ్డారు.తనకు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే ప్రశ్నిస్తున్నానన్న జూపల్లి ఎవరైనా చర్చకు రావాలని సవాల్ చేశారు.

అందుకే ‘ పల్లా ‘ కు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు