కేసీఆర్ ఆ ప‌ని చేస్తే.. జ‌గ‌న్ ఆ దారిలో న‌డుస్తారా..

ఇప్పుడు చాలా రోజులుగా తెలంగాణ‌లో ఓ విష‌యం హాట్ టాపిక్ గా మారుతోంది.

అదే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌.జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ వెళ్తార‌నే ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో ఉంది.

గ‌తంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎంపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ ఫ్రంట్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఆ త‌ర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు.ఇక ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి నినాద‌మే ఎత్తుకుంటున్నారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బీజేపీ ప‌ని ప‌ట్టాల‌ని చెబుతున్నారు.ఇందులో భాగంగానే కొన్ని పార్టీలను క‌లుస్తున్నారు.

మొన్న‌టికి మొన్న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌, సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి లాంటి క‌మ్యూనిస్టు నేత‌ల‌ను పిలిపించుకుని మాట్లాడారు.

బీజేపీపై క‌లిసిక‌ట్టుగా పోరాడాలంటూ మ‌ద్ద‌తు కోరారు.అయితే ఇప్పుడు మ‌రో అంశం కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్‌, జ‌గ‌న్ హ‌వా ఏ మేర‌కు ఉందో అంద‌రికీ తెలిసిందే.

ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా బాగానే ఎంపీలు ఉన్నారు.రాబోయే రోజుల్లో ఏపీ డెవ‌ల‌ప్ మెంట్ కావాలంటే ప్రాంతీయ పార్టీల‌తో ఏర్ప‌డిన కేంద్ర ప్ర‌భుత్వం జ‌గ‌న్ కు చాలా అవ‌స‌రం.

"""/"/ ఏపీలో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు కాబ‌ట్టి.

ఏపీకి నిధులు, ఇత‌ర అవ‌స‌రాలు తీరాలంటే బీజేపీ కాకుండా ఇత‌ర పార్టీల‌తో ఏర్ప‌డిన కేంద్ర ప్ర‌భుత్వం అయితేనే బెట‌ర్ అని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు.

దీంతో ఇప్పుడు కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో జ‌గ‌న్ చేరుతారా అనే అంశం కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది.

కానీ కేసీఆర్ కంటే ఎంపీలు ఎక్కువ‌గా ఉన్న జ‌గ‌న్ ఆయ‌న దారిలో న‌డుస్తారా అనే డౌట్ కూడా వ‌స్తోంది.

ఏది ఏమైనా రాబోయే రోజుల్లో జాతీయ రాజ‌కీయాల్లో తెలుగు రాష్ట్రాల హ‌వా బాగానే ఉండేలా క‌నిపిస్తుంది.

జ్యోతిష్యుడిని నమ్మి లాటరీ కొన్న యూఎస్ మహిళ.. కట్ చేస్తే రూ.4కోట్లు గెలిచింది..