కేసీఆర్ పూర్తి చేస్తే రేవంత్ రెడ్డి ప్రారంభించారు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు.

శనివారం సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శనివారం సీఎం రేవంత్ కామెంట్స్ పై కేసీఆర్ పూర్తి చేసిన పనులను ప్రారంభోత్సవం చేసి రేవంత్ గప్పాలు కొట్టుకుంటున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఏడాది కాలంలో పైసా నిధులతో పనులు చేయని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని,యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ విజన్ అని పేర్కొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతిస్థిమితం లేని వ్యక్తి అని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ ను కూలగొడుతామన్నారని, ఇప్పుడు ఆయనే గొప్ప ప్రాజెక్టు అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసింది మేమని,నిన్న ఫోటోలకు ఫోజులిస్తూ నానా హంగామా చేశారన్నారు.

మూసీ ప్రక్షాళనను మొదలు పెట్టింది కూడా మేమేనని, కాంగ్రెస్ చేసిన ఘనత ఏందంటే నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేయడమేనని,కాంగ్రెస్ దద్దమ్మల వల్ల తెలంగాణ మళ్ళీ పదేళ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రులు అక్రమ వసూళ్లకు తెగబడి ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు.ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నది ఒక్క కేసీఆర్ మాత్రమేనని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ మాత విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నారని,కాంగ్రెస్ మాత విగ్రహం సచివాలయంలో పెడితే మేం ఒప్పుకోమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం లో నల్లగొండ,నకిరేకల్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మంచు వివాదంలో తప్పు మనోజ్ దేనా.. ఆ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయిగా!