రోడ్డుపై ఉంటే, వ్యాను.. నీటిలో దిగగానే బోటుగా మారిపోతుంది!
TeluguStop.com
రోడ్డుపై ఉంటే, వ్యాను.నీటిలో దిగగానే బోటుగా మారిపోవడం ఏమిటి? ఇక్కడ మాయమంత్రం ఎమన్నా జరుగుతుందా? అని మీకు అనుమానం కలగవచ్చు.
కానీ ఇక్కడ అలాంటిది ఏది లేదు.అవును, అది రోడ్డు మీద పరుగులు పెట్టేటప్పుడు వ్యాను.
నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు.నేల మీదనే కాకుండా నీటిలోనూ సమర్ధవంతంగా ప్రయాణించగల ఉభయచర వాహనం అది.
అయితే దీనిని తయారు చేసింది మనదగ్గర కాదండోయ్.జర్మనీ( Germany )కి చెందిన వాహనాల తయారీ సంస్థ 'సీల్ వ్యాన్స్( Seal Van )' ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది.
"""/" /
అది నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్‌పవర్ హోండా మోటారు సాయంతో పని చేస్తుంది.
ఇక నీటిలో ప్రయాణించేటప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ సాయంతో పని చేస్తుంది.
ఇది 4.20 మీటర్ల మోడల్‌లోను, 7.
50 మీటర్ల మోడల్‌లోను మనకు దొరుకుతుంది.'సీల్‌వ్యాన్స్' 4.
20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది.ఇక 7.
50 మీటర్ల మోడల్‌లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ఇందులో ప్రయాణించవచ్చు.
"""/" /
ఇంకో విషయం ఏమిటంటే, యూరోప్( Europe )లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కానేకాదు.
నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోగలదు.మోడల్‌ను బట్టి దీని ధర 30,500 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.
25.25 లక్షలు వరకు ఉంటుంది.
మరో మోడల్ 63,800 డాలర్లు అంటే మన రూపాయలలో అక్షరాలా రూ.49.
86 లక్షలు వరకు మరి.ఈ వాహనం కావాలంటే మనం కూడా ఇండియా తెప్పించుకోవచ్చు.
అయితే దానికి అదనపు ఖర్చులు తప్పనిసరి.అయితే ఇక్కకికొచ్చేసరికి వాటికి లైసెన్స్ అవసరం ఉంటుంది మరి.
కాబట్టి ఔత్సాహికులు ఒక్కసారి ట్రై చేసి చూడండి.అలాంటి వాహనాలు ఇక్కడ కావాలని ఎదురు చూస్తే మాత్రం దానికి ఇంకా చాలా సమయం పడుతుంది మరి.
కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?