మధుమేహం, గుండెజబ్బులకు దూరంగా ఉండాలా.. అయితే ఇది మీ డైట్ లో ఉండాల్సిందే!

ఇటీవల రోజుల్లో మధుమేహం( Diabetes ) బాధితులు అంతకంతకు పెరిగిపోతున్నారు.అలాగే ప్రతి ఏడాది గుండె జబ్బులతో( Heart Diseases ) మరణిస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

ఈ సమస్యలకు దూరంగా ఉండాలి అంటే కచ్చితంగా డైట్ లో కొన్ని కొన్ని ఆహారాలను చేర్చుకోవాల్సిందే.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ని ( Smoothie ) రెగ్యులర్ గా తీసుకుంటే మధుమేహం గుండె జబ్బులు మీ దరిదాపుల్లోకి కూడా రావు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు అంజీర్, ఆరు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ సోయా పాలు వేసుకుని బాగా మిక్స్ చేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఐదు బాదం, ఐదు జీడి బద్దలు, అర కప్పు ఫూల్ మఖానా వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.

ఇలా ఫ్రై చేసుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న అంజీర్, ఖర్జూరంను సోయా పాలతో సహా వేసుకోవాలి.

అలాగే చిటికెడు కుంకుమపువ్వు, ఒక కప్పు వాటర్ మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న‌ పౌడర్ ను కూడా వేసి బ్లెండ్‌ చేసుకోవాలి.

తద్వారా హెల్తీ అంజీర్ మఖానా స్మూతీ( Anjeer Makhana Smoothie ) సిద్దమవుతుంది.

ఈ స్మూతీ హెల్త్ పరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.ఈ స్మూతీని రోజుకు ఒక గ్లాసు చొప్పున రెగ్యులర్ గా తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.

"""/" / గుండె ఆరోగ్యంగా మారుతుంది.గుండెపోటుతో సహా వివిధ రకాల గుండె సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.

అంతేకాదండోయ్ ఈ స్మూతీ వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.వయసు పైబ‌డిన మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.

ఈ పాత్రను వీరు కాకుండా మరెవరు చేసిన అద్భుతంగా ఉండేవి !