ఆయన కి తగ్గ మనవణ్ణి నేనే అది చేయాలంటే నా వల్లే అవుతుంది..?

అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) మనవడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ మొదట్లో చాలా మాస్ సినిమాలు చేశాడు వాటి ద్వారా హిట్ రాకపోవడం తో ఆ తర్వాత సత్యం లాంటి ఒక లవ్ స్టోరీ చేసి మంచి హిట్ అందుకున్నాడు.

కానీ సత్యం సినిమా తర్వాత మళ్లీ ఆయన చాలా కాలం పాటు హిట్ కొట్ట లేకపోయారు.

అక్కినేని నాగేశ్వరావు గారి గ్లామర్, నటన రెండూ ఉన్నా కథల ఎంపికలో తడబడి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు.

ఈ మధ్య కాలంలో అడపా దడపా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే కథ నచ్చితే హీరోగా కూడా సినిమాలను చేస్తూ అలరిస్తున్నారు.

అయితే సుమంత్ ( Sumanth )తన తాత బయో పిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు.

ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ మాట్లాడుతూ ఏఎన్ఆర్ బయో పిక్( ANR Bio Pic ) గురించి ప్రశ్న ఎదురు కాగా ఆ బయోపిక్ చేయాల్సి వస్తె అది నేనే చేయాలి, నాకు అనుభవం కూడా ఉంది అంటూ చెప్పారు సుమంత్.

మహానాయకుడు, కథనాయకుడు సినిమాల్లో నాగేశ్వరావు గారి లాగా సుమంత్ కనిపించారు.అయితే వయసు రీత్యా బయో పిక్ లో నాగేశ్వరావు గారిని చూపించాలని అనుకున్నపుడు నాగార్జున గారు నేను, నాగచైతన్య( Naga Chaitanya ) చేస్తే బాగుంటుంది అంటూ చెప్పారు.

ఇక ఈ జనరేషన్ లో నచ్చిన నటుడు ఎవరంటే జనరేషన్ అంటే ఎవరు, అందులో ఉన్నది ఏ హీరోలో చెప్పాలి.

"""/" / ఎందుకంటే నేను, మహేష్, పవన్, ఎన్టీఆర్( Mahesh, Pawan, NTR ) ఒక జనరేషన్ వాళ్లం అంటూ చెప్పారు.

నాకు మా జనరేషన్ లో మహేష్ నచ్చుతాడు.మహేష్ కాకుండా అంటే ఎన్టీఆర్ నటన నచ్చుతుంది, తాను ఆల్ రౌండర్ తన సినిమాలను చూస్తుంటాను అంటూ చెప్పారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కూడా వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది.అయితే వారి నటన నైపుణ్యం వల్ల ఇండస్ట్రీలో హవా కొనసాగుతుంది.

మరికొందరు వారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. """/" / అలాంటి వారిలో అక్కినేని వారసుడు కూడా ఉన్నారని చెప్పవచ్చు.

అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం మొదటి వారసుడిగా ప్రేమకథా చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు సుమంత్.

ఒకవైపు ఏఎన్ఆర్ మనవడిగా, మరొకవైపు నాగార్జున మేనల్లుడిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకోలేక పోయారు.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో లో వస్తున్న సినిమా బడ్జెట్ ఎంతంటే..?