Renu Desai: నేను వరుణ్ తేజ్ పెళ్లికి వెళితే వాళ్లకి నచ్చదు .. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ( Renu Desai ) ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతుంది.

ఇక ఈ మధ్యనే రేణుదేశాయ్ రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageshwar Rao ) అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

అయితే ఈ సినిమా ప్లాఫ్ అయినప్పటికీ రేణు దేశాయ్ పాత్రకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి కోసమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజ్నోవాతో కలిసి వెళ్లిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.

"""/" / అయితే వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.

మేము వరుణ్ తేజ్ ( Varun Tej ) పెళ్లికి వెళ్లడం లేదు.

గతంలో నిహారిక పెళ్లికి అకీరా నందన్, ఆద్య ఇద్దరు వెళ్లారు.కానీ ఇప్పుడు వెళ్లడం లేదు.

ఇక చిన్నప్పటినుండి వరుణ్ తేజ్ నా కళ్ళముందే పెరిగాడు.అతనికి నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి.

ఒకవేళ నేను పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు.

అందుకే నేను వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చింది. """/" / ప్రస్తుతం రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో రేణుదేశాయ్ కి ఆహ్వానం అందినప్పటికీ కూడా ఈమె అక్కడికి వెళ్తే కొంతమందికి నచ్చకపోవడం వల్లే మెగా ఫ్యామిలీ లో జరిగే ఫంక్షన్లకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈసారి ఆద్య, అకీరా నందన్ ( Akira Nandan ) లు కూడా పెళ్లికి వెళ్లినట్టు కనిపించడం లేదు .

ఎందుకంటే రీసెంట్ గా తన కూతురు ఆద్య ( Aadya ) తో కలిసి ముంబైలో కాలీ పీలీ టాక్సీని ఎక్కించింది రేణు దేశాయ్.

దానికి సంబంధించిన వీడియోలు,ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ నెలాఖరులో కాలీ పీలి టాక్సీలను రద్దు చేయబోతున్నారు.

అందుకే చివరిసారిగా ఆ టాక్సి లో తన కూతుర్ని ఎక్కించింది రెణు దేశాయ్.

మొదటి బంతికే 15 పరుగులు.. ఎలా అంటే? (వీడియో)