కథ దొరికితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తా - కళ్యాణ్ రామ్
TeluguStop.com
మంచి కథ దొరికితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లు సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు.
ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కళ్యాణ్ రామ్, బింబిసార మూవీ టీంతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.ఆగస్టు 5వ తేదీన బింబిసార చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని, సినిమా విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్ధిస్తూ, స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు.
కధ వస్తే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తానన్నారు.తిరుమలలో రాజకీయ ప్రస్తావన మాట్లాడడానికి కళ్యాణ్ రామ్ నిరాకరించారు.
గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?