ఈ చెట్టు కింద షూటింగ్ చేస్తే సినిమా సూపర్ హిట్.. ఈ చెట్టు ఎక్కడ ఉందంటే?

ఇతర రంగాలతో పోలిస్తే సినిమా రంగానికి చెందిన వాళ్లు సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మడంతో పాటు పాటిస్తారనే విషయం తెలిసిందే.

గోదావరి తీరంలో సినిమా తీస్తే హిట్ అని చాలామంది భావిస్తారు.గోదావరికి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో ప్రతిరోజూ ఎన్నో సినిమాల షూటింగ్ జరుగుతుంది.

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగస్థలంతో పాటు పుష్ప సినిమా షూటింగ్ కూడా గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ జిల్లాల్లోని కొన్ని లొకేషన్లలో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అని అప్పటి స్టార్ డైరెక్టర్లు నమ్మేవారు.

అయితే కొవ్వూరు మండలంలోని కుమారదేవంకు సమీపంలో ఉన్న నిద్రగన్నేరు చెట్టు దగ్గర షూటింగ్ చేస్తే సినిమా హిట్ అని దర్శకనిర్మాతలు భావిస్తారు.

చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమాతో పాటు కృష్ణ నటించిన పాడి పంటలు సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది.

దాదాపుగా 300 సినిమాల షూటింగ్ జరిగిందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు.మూగ మనస్సులు, భక్త కన్నప్ప, ఏఎన్నార్ నటించిన మేఘ సందేశం సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది.

గోదావరి తీరంలో కృష్ణవంశీ నటించిన మురారి మూవీ షూటింగ్ కూడా జరిగింది.ఈ సినిమాలోని డుమ్ డుమ్ నటరాజు పాటను గోదావరి ఇసుక తిన్నెలపై చిత్రీకరించారు.

రంగస్థలం సినిమాలోని కొన్ని సన్నివేశాలు గోదావరి తీర ప్రాంతంలో తెరకెక్కించారు. """/"/ తమిళ మూవీ సూర్య, హిందీ మూవీ హిమ్మత్ వాలా షూటింగ్ లు కూడా గోదావరి తీర ప్రాంతంలో జరిగాయి.

తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలు పూర్తిగా గోదావరి తీరంలో తెరకెక్కడం గమనార్హం.గోదావరి, అందాల రాముడు సినిమాలు పూర్తిగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కాయి.

గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి.