మనం వండే కూరల్లో ఉప్పు, కారం ఎక్కువైతే ఏం చేయాలంటే..?!

మనం సాధారణంగా ఎంతో ఇష్టపడి వండిన కూరలలో ఒక్కోసారి ఉప్పు , కారం ఎక్కువ అవుతూ ఉంటాయి.

దీంతో ఒక్కసారిగా ఆ కూర టేస్ట్ మారిపోతుంది.ఆ సమయంలో ఆ కూరను అటు తినలేము ఇటు పడయలేం ఒక వేళ అదే కర్రీలో ఉప్పు తక్కువైతే దానికి  తగ్గట్టు మళ్లీ ఉప్పు వేసుకోవచ్చు కానీ, అదే ఎక్కువైతే మాత్రం చేసేది ఏమి లేక పడేస్తూ  ఉంటాం.

ఇలా కూరలలో ఉప్పు, కారం ఎక్కువ అయినప్పుడు కొన్ని చిట్కాలు పాటించి కూర లోని ఉప్పు, కారం సులువుగా తగ్గించుకోవచ్చు.

అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.కూరలో ఉప్పు ఎక్కువ ఉన్నట్లయితే కాస్త కొబ్బరి ఉంటే దానిని మిక్సీలో వేసుకొని అందులోని  పాలు పక్కకు తీసుకోని వాటిని ఉప్పు ఎక్కువగా కూరల్లో వేస్తే చాలు, ఉప్పు తగ్గడమే కాకుండా కూర కూడా చాలా బాగా రుచికరంగా మారిపోతుంది.

అలగే కూరలో ఉప్పు ఎక్కువ అయిన సందర్భాలలో ఇంట్లో ఒక బంగాళదుంప ఉంటే దాన్ని కట్ చేసి కూరలో వేసి కాసేపు ఉడికించాలి.

దీనితో కూరలో ఉండే నీటితో పాటు ఉప్పు మొత్తం  బంగాళ దుంపలు పిలుచుకుంటాయి.

దీనితో ఒక్కసారిగా కూరలోని ఉప్పు తగ్గిపోతుంది.కర్రీ తినేముందు ఆ బంగాళదుంప ముక్కలను తీసేసి తినవచ్చు.

ఇక అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే మరో చిట్కా ఏంటంటే పాలు లేదా పెరుగు కలిపితే మంచి రుచి వస్తుంది.

లేదంటే కాస్త నిమ్మరసం కూడా కూరలలో కలిపితే  చాలు. """/" / అదే కూరలలో కారం ఎక్కువైతే మాత్రం  టమాటాలు వేయించి ఆ కూర లో వేస్తే చాలు.

అదే నాన్ వెజ్ వంటకం అయితే కాస్త నిమ్మరసం వేస్తే చాలు.అందులో ఉండే కారం మొత్తం తగ్గిపోతుంది.

ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఎప్పుడైనా కూరలో ఉప్పు లేదా కారం ఎక్కువ అయితే ఈ చిట్కాలు పాటించండి.