చేతికందొచ్చిన కన్నకొడుకుని మృత్యువు కబళిస్తుంటే, కన్నవారు చేసిన పని కన్నీళ్లు పెట్టిస్తోంది!

చేతికందొచ్చిన కన్నకొడుకు కళ్ళముందే ప్రాణాలతో కొట్టుమిట్టాడితే ఆ తల్లిదండ్రులకి అంతకంటే పెద్ద శిక్ష ఏమీ ఉండదు.

ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు వెళ్తాడని కలలు కన్న బిడ్డ.

కళ్ల ముందు విగతజీవిగా పది ఉండడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.‘ఒక్కసారి లేవరా’.

‘అమ్మను వచ్చాను చూడరా’ అంటూ ఆమె కన్నీటి పర్యంతం అవుతుంటే చుట్టుపక్కలవారికి కన్నీళ్లు తిరిగాయి.

తమ బిడ్డను తిరిగి బ్రతికించుకుంటామంటూ ఆ తల్లిదండ్రులు చేసిన పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

అవును, వారికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు గాని, తనయుడు మృతదేహాన్ని గంటల తరబడి ఉప్పులో దాచి ఉంచారు.

అలా ఎంతసేపు ఉంచినా బాలుడిలో కదలిక లేకపోవడంతో వేరే గత్యంతరం లేక అంత్యక్రియలు నిర్వహించారు.

వివరాల్లోకి వెళ్తే.కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిర్​వారా అనే గ్రామానికి చెందిన బాలుడు తన మిత్రులతో కలిసి.

సమీపంలో వున్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు.లోతు ఎక్కువగా ఉండటం, పైగా అతడికి ఈత సరిగ్గా రాకపోవడంతో.

నీటిలో మునిగి చనిపోయాడు.విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లారు.

అప్పటికే చనిపోయి వున్న తనయుడి మృతదేహంపై పడి బోరున విలపించారు.ఈ క్రమంలోనే నీటిలో మునిగి చనిపోయినవారి మృతదేహాన్ని ఉప్పులో ఉంచితే.

తిరిగి వారికి ప్రాణం వస్తుందని గతంలో ఎవరో చెప్పిన విషయం వారికి గుర్తుకు వచ్చింది.

దాంతో వెంటనే 5 బస్తాలు ఉప్పు తెప్పించి, డెడ్‌బాడీపై పోశారు.అలా ఎన్ని గంటలు వేచి చూసినా.

బాలుడిలో చలనం రాలేదు.దీంతో చివరికి అంత్యక్రియలు చేయక తప్పలేదు.

కాగా ఇలాంటి మూఢనమ్మకాల గురించి వారికి పెద్దగా అవగాహన ఉండదు.అయినా, తనయున్ని దక్కించుకోవాలి అని ప్రయాసపడిన వారి దీనావస్థని మనం కొనియాడకుండా ఉండలేము.

రాంగ్ టైం లో రిలీజ్ అయ్యి ప్లాప్ అయిన మంచి సినిమాలు ఇవే !