సైబర్ క్రైమ్ జరిగితే…1930 కి కాల్ చేయండి..!

నల్లగొండ జిల్లా: సమాజంలో ఇటీవల కాలంలో సైబర్ నేరాల ( Cyber ​​crimes )సంఖ్య పెరిగి,అనేకమంది సైబర్ నేరాల బారిన పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎవరికైనా సైబర్ నేరగాళ్ల వలన నష్టం కలిగినప్పుడు వెంటనే రికవరీ చెయ్యటానికి ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నంబరు అందుబాటులోకి తెచ్చింది.

ఈ టోల్ ఫ్రీ నంబరు గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు మొబైల్ వ్యాను ప్రచారం ప్రారంభించింది.

మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో 1930 టోల్ ఫ్రీ మొబైల్ వాహనాన్ని నల్లగొండ డిజిఎం ప్రశాంత్ కుమార్ బరియార్, నల్లగొండ రీజినల్ మేనేజర్ మొహమ్మద్ అలీముద్దీన్ సంయుక్తంగా జండా ఊపి ప్రారంభించారు.

ఈ ప్రచారం నల్గొండ ఏవో పరు పరిధిలోని అన్ని ప్రాంతాలలో సాగుతుందని తెలిపారు.

చరణ్ తో ఆ హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!