పిల్ల‌ల చేత రోజుకో 4 వాల్‌న‌ట్స్ తినిపిస్తే ఇక వారికి తిరుగుండ‌దు!

వాల్‌న‌ట్స్‌.వీటి గురించి మీకు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

వీటిని అక్రోట్స్ అని కూడా పిలుస్తుంటారు.వాల్‌న‌ట్స్ యొక్క ఖ‌రీదు కాస్త ఎక్కువే అయిన‌ప్ప‌టికీ.

అందుకు త‌గ్గా పోష‌కాలు వాటిలో పుష్క‌లంగా నిండి ఉంటాయి.ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోష‌కాలెన్నో వాల్‌న‌ట్స్ ద్వారా పొందొచ్చు.

అందుకే న‌ట్స్‌లోనే అద్భుత‌మైన‌విగా వాల్‌న‌ట్స్‌ను చెబుతుంటారు.ఇవి అన్ని వ‌య‌సుల వారికి మేలు చేస్తాయి.

ముఖ్యంగా పిల్ల‌ల చేత రోజుకో నాలుగు నాన‌బెట్టిన వాల్‌న‌ట్స్‌ను తినిపిస్తే.ఇక వారికి తిరుగుండ‌దు.

ఆరోగ్య ప‌రంగా వ‌ల్‌న‌ట్స్ ద్వారా వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి.మ‌రి ఆ లాభాలు ఏంటీ.

? అస‌లు పిల్ల‌ల చేత వాల్‌న‌ట్స్ ఎందుకు తినిపించాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్ల‌ల శారీరక మరియు మానసిక అభివృద్ధిని ప్రభావితం చేసేది పోష‌కాహార‌మే.అటువంటి పోష‌కాహారంలో వాల్‌న‌ట్స్ ఒక‌టి.

నైట్ అంతా వాట‌ర్‌లో నాన‌బెట్టిన ఓ నాలుగు వాల్‌న‌ట్స్‌ను రోజూ ఉద‌యాన్నే పిల్ల‌ల చేత తినిపించాలి.

త‌ద్వారా వాల్‌న‌ట్స్‌లో ఉండే పోష‌కాలు పిల్లల మెదడు అభివృద్ధికి తోడ్ప‌డ‌తాయి.జ్ఞాప‌క శ‌క్తిని, ఆలోచ‌నా శక్తిని పెంపొందిస్తాయి.

అలాగే పిల్ల‌ల ఎముకలు, దంతాలు బలంగా త‌యారు అవుతాయి. """/" / వారి రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ సూప‌ర్ స్ట్రోంగ్‌గా మారుతుంది.

అంతేకాదు, పిల్ల‌ల డైట్‌లో వాల్‌న‌ట్స్‌ను చేరిస్తే.వారిలో ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి వారిని ర‌క్షించ‌వ‌చ్చు.నీర‌సం, అల‌స‌ట వంటివి త‌ర‌చూ వారిని ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

మ‌రియు వారి గుండె ప‌ని తీరు సైతం మెరుగ్గా మారుతుంది.ఇన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్నాయి కాబ‌ట్టి.

మీ పిల్ల‌ల డైట్‌లో వాల్‌న‌ట్స్‌ను చేర్చ‌డం మాత్రం మ‌ర‌చిపోకండి.

ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..