ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఆ ఇద్దరి వికెట్లు తీస్తే ఇండియా గెలిచినట్లే..

ప్రస్తుతం టీమిండియా క్రికెట్ జట్టుతో పాటు ప్రపంచంలోని టి20 ప్రపంచ కప్ కు అర్హత సాధించిన క్రికెట్ ఆడే దేశాలు T20 ప్రపంచ కప్ ఆడెందుకు ఆస్ట్రేలియా లో ఉన్నాయి.

టి20 ఆడెందుకు ప్రతి దేశం సన్నాహక మ్యాచ్ లు ఆడి వారి క్రికెట్ జట్లను టి20 ప్రపంచ కప్ కోసం సిద్ధం చేసుకున్నాయి.

టీమిండియా వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈనెల 23వ తేదీన పాకిస్తాన్ తో తలపడనుంది.

ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచంలోని చాలామంది ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు.

అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్లో రెండు టీమ్ల బాలాలు బలహీనతలు ఏ విధంగా ఉన్నాయో అనే విషయంపై కూడా మాజీ క్రికెటర్లు చర్చించుకుంటున్నారు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్తాన్ ఓపెనర్లకు ఏమాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వకూడదు అంటూ వెల్లడించాడు.

ముఖ్యంగా మహమ్మద్ రిజ్వాన్ పవర్ ప్లే లో స్ట్రైక్ తీసుకుంటాడని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.

బాబర్ అజం కాస్త సమయం తీసుకునే అవకాశం ఉంది.అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా ఆ ఇద్దరినీ బోల్తా కొట్టించే బంతులను బౌలర్లు వేయగలిగితే టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇక ఇద్దరి లెంత్ విషయంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. """/"/ మహమ్మద్ రిజ్వాన్ కు స్టంప్స్ లక్ష్యంగా పుల్లర్ బాల్ వేసి ఇతన్ని ఇబ్బందికి గురి చేయవచ్చు.

లైన్ అండ్ లెంగ్త్ తో మోకాలి మీదకు బంతిని వేయాలి.ఇక బాబర్ విషయానికి వస్తే అతన్ని ఎల్బి అవుట్ చేసేందుకు చూడవచ్చు.

ఇక ఇద్దరిని అవుట్ చేస్తే పాకిస్తాన్ ను దెబ్బతీసినట్లే అంటూ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.

ఇలా చేయడం వల్ల టీమ్ ఇండియా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అని ఈ సందర్భంగా చెప్పాడు.