భీమ్లా నాయక్ బాలయ్య చేసుంటే..!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాలు కలిసి చేసిన భీమ్లా నాయక్ సినిమా సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది.
ఏపీలో టికెట్ల రేట్లు బాగా లేకపోయినా సరే భీమ్లా నాయక్ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో సూపర్ హిట్ అందించింది భీమ్లా నాయక్.
ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేయగా త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు.
సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.
మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో రానా పాత్ర ముందే ఫిక్స్ అవగా భీమ్లా నాయక్ పాత్రకి ఎవరిని తీసుకోవాలా అన్న చర్చ భారీగా నడిచింది.
ఒకానొక దశలో ఈ రీమేక్ లో బాలకృష్ణ నటిస్తున్నారన్న టాక్ కూడా వచ్చిది.
అయితే బాలయ్య ఎందుకు కాదనుకున్నారో కానీ త్రివిక్రం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాక పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చాడు.
ఫైనల్ గా భీమ్లా నాయక్ సినిమా రూపొందింది.అయితే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ బదులుగా బాలకృష్ణని ఊహించుకుంటే ఎలా ఉంటుందో అని సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక చర్చ నడుస్తుంది.
ఆయన చేస్తే కూడా ఇదే రేంజ్ ఇంప్యాక్ట్ ఉండేదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?