నేటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడితే ఖాతాలో అత్యంత చెత్త రికార్డు ఖాయం..!

భారత్- ఆస్ట్రేలియా( India- Australia ) మధ్య నేడు మూడో వన్డే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది.

ఈ సిరీస్ లో భారత్ వరుస రెండు మ్యాచ్లను గెలిచి ఇప్పటికే సిరీస్ ఖాతాలో వేసుకుంది.

కాకపోతే ఈ మ్యాచ్ గెలవకపోతే ఆస్ట్రేలియా ఖాతాలో అత్యంత చెత్త రికార్డు నమోదు అవ్వనుంది.

అంతేకాదు నేటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడితే వరుసగా 6 వన్డేలలో ఓడినట్టు అవుతుంది.

2023లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా వరుసగా 5 వన్డే మ్యాచ్లలో ఓటమిని చవి చూసింది.

2020లో కూడా వరుసగా 5 వన్డే మ్యాచ్లలో ఓడి ఆరవ వన్డే మ్యాచ్లో విజయం సాధించింది.

మరి నేటి మ్యాచ్లో గెలుస్తుందా.లేదంటే చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

"""/" / 2020లో దక్షిణాఫ్రికా, భారత్ చేతులలో వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిన ఆస్ట్రేలియా జట్టు ఆరో మ్యాచ్లో న్యూజిలాండ్( New Zealand ) పై విజయం సాధించింది.

తాజాగా 2023లో ఆస్ట్రేలియా భారత్ తో ఆరవ మ్యాచ్ ఆడుతోంది.ఈ మ్యాచ్లో గెలవడం ఆస్ట్రేలియా జట్టుకు అసాధ్యమే.

ఎందుకంటే భారత జట్టులోని ఆటగాళ్లందరూ ఫుల్ ఫామ్ నే కొనసాగిస్తున్నారు.ఇక భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) గైర్హాజరు కావడంవల్ల కేఎల్ రాహుల్ ( KL Rahul )భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా నాయకత్వం వహించాడు.

నేడు జరిగే మూడో వన్డే మ్యాచ్ కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.

అంతేకాదు నేటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ జట్టులోకి రానున్నారు.

మరి భారత్ ఈ మ్యాచ్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయనుందా.లేదంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో గెలిచి తన పరువు కాపాడుకోనుందా చూడాల్సి ఉంది.

బ్రెయిన్ సూపర్ షార్ప్ గా పని చేయాలంటే ఈ జ్యూస్ తాగండి..!