ప్రశ్నిస్తే దాడులా?.. సోము వీర్రాజు ఫైర్

బీజేపీ నేత సత్యకుమార్ పై జరిగిన దాడిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు.

ఆయనపై చేసిన దాడి పిరికి చర్యని చెప్పారు.రాజధాని ఉద్యమానికి మద్ధతు తెలిపితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.

సత్యకుమార్, ఆయన వాహనంపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించలేదని సోము వీర్రాజు మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంకోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే సహించేది లేదని తేల్చి చెప్పారు.