మీలో ఎవరికైనా చేతికి 6వ వేలు ఉంటే ఇది చదవండి.. ముఖ్యమైన విషయాలు!

మనలో చాలా అరుదుగా కొంతమందికి చేతులకు గాని, కాళ్లకు గాని ఒక వేలు అదనంగా ఉండటం మనం గమనించవచ్చు.

మనుషులలో ప్రత్యేకమైన శారీరక నిర్మాణాలతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

సాధారణంగా 5 వేళ్ళు కలిగిన వారికంటే వీరు కాస్త భిన్నంగా ఉంటారని తెలుస్తోంది.

వీటి వలన సానుకూల ఫలితాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు.శ‌రీరంలో సాధారణంగా ఉండే అవ‌య‌వాల‌కు మించి అధికంగా మ‌రోటి ఉంటే దాని ప‌నిత‌నం ఎలా ఉంటుంద‌నే విష‌యంపై ఇపుడు ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

ఈ ప్రయోగాల్లో భాగంగా కొన్ని రోబోలు, కొన్ని యంత్రాలు మన మెదడు ఇలాంటి ఎక్స్ట్రా అవ‌య‌వాల‌కు ఎలా స్పందిస్తుందో పరిశీలిస్తున్నారు.

అంతేకాక‌, మ‌న అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మ‌రో రోబో అవ‌య‌వాన్ని అమ‌ర్చుకుంటే ప‌నిత‌నం ఎలా ఉంటుందో కూడా ప‌రిశీలిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే జపాన్‌లోని పరిశోధకులు రోబోటిక్ "6వ వేలు"ని రూపొందించారు.మ‌న చేతికి 6వ వేలు ఉంటే అది రోజువారీ జీవితంలో ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో దీని ద్వారా ప‌రిశోధ‌న చేస్తున్నారు.

ప్ర‌స్తుత‌మున్న 5 వేళ్ల‌కు మ‌రో వేలు ఉండ‌టం వ‌ల్ల జీవితంలో చాలా ప‌నులు సులభతరం అవ్వ‌డానికి సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు.

ప‌రిశోధ‌న‌లో రూపొందించిన ఈ రోబోట్ వేలు వస్తువులను మోయడం, కంప్యూటర్‌లో టైప్ చేయడం వంటి రోజువారీ కార్యకలాపాలకు జీవితాన్ని సులభతరం చేస్తుందని పరిశోధకులు ఇపుడు చెబుతున్నారు.

ఈ సాంకేతికతను మెరుగుపర‌చ‌డం ద్వారా మానవులు ఏదో ఒకరోజు తమ శరీరాలను తమకు తగినట్లుగా డిజైన్ చేసుకోవచ్చని పరిశోధకులు చెప్పడం గమనార్హం.

రెహమాన్‌ మ్యూజిక్‌లో మైఖేల్‌ జాక్సన్‌ తమిళ్‌ సాంగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ..?