సీఎంపై ఆరోపణలు చేస్తే బీజేపీ ఆఫీస్ ముట్టడి..: మల్లు రవి

తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవి( Mallu Ravi ) కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) ఆరోపణలు చేస్తే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.

ఆగస్ట్ 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని మల్లు రవి పేర్కొన్నారు.

ఈ క్రమంలో రుణమాఫీ చేయరని ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు.ఆరు గ్యారంటీలు అమలు అవుతున్న సంగతి బీజేపీకి ( BJP ) తెలియదా అని నిలదీశారు.

తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని చెప్పారు.ఇక ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ ప్రభుత్వం ఏర్పడుతుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.

కేటీఆర్ జన్మదినం సందర్భంగా డే కేర్ సెంటర్లో దుప్పట్ల పంపిణీ