Crow : ఇంటి ముందు కాకి పదే పదే అరిస్తే దీనికి సంకేతమా..?

కాకులతో మనుషులకు ఏదో ఒక సంబంధం ఉంటుంది.పురాణాలలో కూడా కాకి గురించి ఎంతో ప్రాధాన్యత ఉంది.

అలాగే మనిషి పుట్టుక నుంచి చావు వరకు కాకికి విడదీయలేని బంధం కూడా ఉంది.

కాకులను పితృదేవతలుగా హిందూ ధర్మంలో ప్రస్తావిస్తారు.అలాగే చనిపోయిన తర్వాత కూడా పిండం కాకి( Crow ) ముట్టాలని సాంప్రదాయం కూడా ఉంటుంది.

ఇంతలా మనిషి జీవితంలో భాగమైన కాకి చేసే పనులు మన జీవితం పై ప్రభావం చూపుతోందని చెబుతారు.

శాస్త్రం ప్రకారం కాకులు మన పూర్వీకుల రూపంలో మన ఇంటి చుట్టు తిరుగుతారని విశ్వాసంతో ఉంటారు.

కాకి ప్రవర్తించే తీరును బట్టి కూడా అంచనా వేస్తారు. """/" / మన భవిష్యత్తును అలాగే మన జీవితంలో జరిగే పలు మార్పుల గురించి చెబుతుందని పండితులు చెబుతున్నారు.

ఇక ఇంటి ముందు కాకి పదే పదే అరవడం కూడా పరిపాటే.అయితే దీని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయి.

ఇంతకీ కాకీ వల్ల కలిగే ఆ శకునాల గురించి, వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వేళ ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు( Relatives ) వస్తారని విశ్వాసం ఉంది.

అయితే ఒక కాకి అరిస్తే ఏమి కాదు కానీ కాకుల గుంపు ఒకేసారి వచ్చి అరిస్తే మాత్రం అ శుభమని పండితులు చెబుతున్నారు.

"""/" / అలాగే ఒక వేళ కాకి తల పై తన్నితే చాలా డేంజర్ అని పండితులు చెబుతున్నారు.

దీన్ని ప్రాణ గండం ఉంటుందని, దీనికి తగిన శాంతి చేసుకోవాలని చెబుతున్నారు.ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ కాకి కుడివైపు నుంచి ఎడమవైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుంది.

కాకి ఎడమ వైపు నుండి కుడివైపుకు వస్తే అశుభం కలుగుతుంది.బయటకు వస్తున్నప్పుడు కాకి ఎడమవైపు నుంచి కుడివైపు వెళ్తే తిరిగి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని కాసేపు కూర్చొని బయటికి వెళ్లాలి.