కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా:కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి,పంట రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కౌలు రైతుల సమస్యలపై మంగళవారం సూర్యాపేట మండల తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కౌలు రైతుల ద్వారానే వ్యవసాయం సాగవుతుందన్నారు.

కౌలు రైతులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

2011 అధీకృత లైసెన్సెడ్ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలని అన్నారు.

కార్డుల ఆధారంగా బ్యాంకు రుణాలు,రైతుబీమా,పంటల బీమా,ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కల్పించిన హక్కులను గ్రామాల్లో ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు.

అధీకృత లైసెన్సులు చట్టం 2011 ప్రకారం పౌరులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రతి సంవత్సరం మే 15 లోపు కౌలురేట్లు నిర్ణయించాలని, 58 సంవత్సరాలు దాటిన ప్రతి కౌలు రైతుకు ఐదు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో నోడల్ ఆఫీసర్లను నియమించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం,కౌలురేట్లు తగ్గించడం కోసం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో రాజేంద్రకుమార్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ, జిల్లా నాయకులు వీరారెడ్డి,కొప్పుల రజిత,మందడి రాంరెడ్డి,నాగిరెడ్డి శేఖర్ రెడ్డి,పందిరి సత్యనారాయణ రెడ్డి,నంద్యాల కేశవరెడ్డి,పిండిగ జానయ్య ప్రజా సంఘాల నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరి రావు,ఎలుగూరి గోవింద్,కోట గోపి, మేకనబోయిన శేఖర్,మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలే బలం : తప్పు అర్థమయ్యిందా రాజా ?