Tanikella Bharani Chiranjeevi: ఆ సినిమాలో చిరంజీవి ఒక సీన్, ఫైట్ డైరెక్ట్ చేశారు.. తనికెళ్ల భరణి వైరల్ కామెంట్స్!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు నటుడు తనికెళ్ల భరణి ( Tanikella Bharani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు తనికెళ్ల భరణి.
సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను బయట పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.కొత్తగా యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన తనికెళ్ల భరణి వరుసగా వీడియోలు పెడుతున్నారు.
ఆ వీడియోలలో సినీ ప్రముఖుల గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవికి ( Chiranjeevi ) సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు.ఈ సందర్భంగా ఆ వీడియోలో చిరంజీవి గురించి మాట్లాడుతూ.
చిరంజీవి గారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎవరి అండా లేకుండా స్వయం కృషితో స్టార్ హీరో అయ్యారు.
అది కొన్ని వందల వేల మందికి ఇన్‌స్పిరేషన్.అలాంటి చిరంజీవిని మా గురువు రాళ్లపల్లి గారు మొదట పరిచయం చేశారు.
కుక్కకాటుకి చెప్పు దెబ్బ అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ నాకు చిరంజీవిని పరిచయం చేశారు.
అదే నేను చిరంజీవిని తొలిసారిగా చూడటం.ఆ తరవాత చిరుతో కలిసి చాలా సినిమాలు చేశాను.
అందులో ఒక సినిమా అనుభూతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. """/" /
అదేంటంటే, మెగాస్టార్ చిరంజీవికి తెర ముందే కాదు, కెమెరా వెనుక ఉంటూ డైరెక్టర్ చేయాలని కోరిక ఉండేదట.
ఒక సినిమా డైరెక్టర్ చేయాలని ఉందని గతంలో కూడా ఆయన తెలిపారు.కానీ చిరంజీవి కోరిక ఇప్పటి వరకు తీరలేదు.
కానీ ఒక సినిమా సమయంలో మాత్రం తన కోరికను తీర్చుకొని ఒక సీన్, ఫైట్ కంపోజ్ చేశారు.
ఆ సినిమానే బిగ్ బాస్.( Big Boss Movie ) ఈ సినిమా చిరంజీవికి అతి పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
"""/" /
అయితే ఈ సినిమాలోని ఒక ఫైట్ సీన్ కంపోజ్ చేశారు.
ఆయన డైరెక్ట్ చేసిన ఆ సీన్‌లో నేను కూడా నటించాను అని తణికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.
ఈ సినిమాకు విజయ్ బాపినీడు అసలు దర్శకుడు కాగా, విజయ బాపినీడు ఫ్రెండ్‌కి బాలేదని వెళ్తే చిరంజీవి డేట్స్ లేని కారణంగా ఆ రోజంతా ఆయనే డైరెక్షన్ కూడా భుజాలకు ఎత్తుకున్నారని చెప్పుకొచ్చారు తనికెళ్ల భరణి.
బాలయ్య బోయపాటి కాంబో మూవీలో కళ్యాణ్ రామ్ హీరోయిన్.. ఆ బ్యూటీకి ఛాన్స్ దక్కిందా?