భారతీయ శాస్త్రవేత్తకి అమెరికన్...'ఏఎస్‌ఏ ఫెలో షిప్'....
TeluguStop.com
మరి భారత తేజానికి అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్ దక్కింది.ఈ రకమైన గుర్తింపు భారతీయులకి దక్కడం కొత్తేమీ కాకపోయినా ఏఎస్‌ఏ ఫెలో షిప్ భారతీయులకి రావడం అరుదుగా జరిగే సంఘటన అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు.
ఏఎస్‌ఏ ఫెలో షిప్ దక్కడం అంటే సామాన్యమైన విషయం కాదని తెలిపారు.ఇంతకీ ఎవరా శాస్త్రవేత్త.
ఎక్కడ ఉంటారు అనే వివరాలలోకి వెళ్తే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇక్రిశాట్ లో మంచి శాస్త్రవేత్త గా గుర్తింపు తెచ్చుకున్న జెనెటిక్స్ గెయిన్స్ విభాగంలో సంచాలకుడిగా పని చేస్తున్న డాక్టర్ రాజీవ్ కె.
వర్షణ ఎంతో ప్రతిభావంతుడు ఆయనకీ పరిశోధనలపై ఎంతో మక్కువ కావడంతో అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ ఫెలోషిప్ కి దరఖాస్తు చేసుకోగా వారి పరిశీలనలో ఎంపిక అయ్యారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ ఫెలోషిప్ కి ఈసారి ప్రపంచవ్యాప్తంగా 14 మందికి ఫెలోషిఫ్‌ను అందిస్తుండగా అందులో ముగ్గురు మినహా అంతా అమెరికన్లు కావడం గమనార్హం వారిలో ఒకరుగా మన భారత్ కి చెందినా రాజీవ్ ఉండటం ఎంతో గర్వ కారణమని ఆయన ఎంపికను ధ్రువీకరించాయి ఇక్రిశాట్ వర్గాలు పేర్కొన్నాయి.
పంటల అభివృద్ధిలో భాగంగా ఆయన జీనో మిక్స్, మాలిక్యులార్ బ్రీడింగ్ అంశాలపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారని ఇక్రిశాట్ తెలిపింది.
నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!