పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నార్రా.. ఫైర్.. 'పుష్ప: ది రైజ్' ట్రైలర్‌కు అనూహ్య స్పందన..

‘పుష్ప: ది రైజ్’ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో.

ఎంత గ్రాండ్‌గా విజువల్ ఫీస్ట్ ఉండబోతుందో కళ్ల ముందు కనిపిస్తుంది.పుష్ప ట్రైలర్‌ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మొదలైంది.

ఆ తర్వాత మధ్యలో చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చారు.శేషాద్రి అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వచ్చే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

అక్కడ వచ్చే వాయిస్ ఓవర్ కానీ.డైలాగ్స్ కానీ అన్నీ అదిరిపోయాయి.

ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మరో స్థాయిలో ఉంది.ఆయన పుష్ప రాజ్ పాత్రకు ప్రాణం పోసారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.

ముఖ్యంగా సూపర్ పోలీస్ ఆఫీసర్‌తో డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్.ఈ లోకం నీకు తుపాకి ఇస్తే.

నాకు గొడ్డలి ఇచ్చింది అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది.

అలాగే చివర్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా.ఫైర్ అంటూ వచ్చే పంచ్ డైలాగ్ కానీ.

డిసెంబర్ 17 నుంచి మాస్ పార్టీ స్టార్ట్స్ అంటూ వచ్చే ట్రైలర్ ఎండ్ కానీ అన్నీ అద్భుతంగా కుదిరాయి.

అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూరుస్తూ.సంచలన దర్శకుడు సుకుమార్, సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోయే పర్ఫెక్ట్ మాస్ సినిమాగా పుష్ప వస్తుంది.

"""/"/ దీనిపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉంది.అలాగే ట్రైలర్‌లో బన్నీ, రష్మిక మధ్యే వచ్చే రెండు మూడు సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి.

మొత్తంగా ట్రైలర్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.

రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

వాటిని నిలబెడుతూ ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది.

ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. """/"/ ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది.

వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.h3 Class=subheader-styleనటీనటలు: /h3p అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు H3 Class=subheader-styleటెక్నికల్ టీం: /h3p దర్శకుడు: సుకుమార్ నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ ఆర్ట్ డైరెక్టర్: S.

రామకృష్ణ - మోనిక నిగొత్రే సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ లిరిసిస్ట్: చంద్రబోస్ క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్ మేకప్: నాని భారతి CEO: చెర్రీ కో డైరెక్టర్: విష్ణు లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలనే రిజెక్ట్ చేసిన ముగ్గురు ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే!