ఐసిఎంఆర్ కొత్త కొవిడ్ టెస్ట్ కిట్.. అరగంటలో రిజల్ట్..!

కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ దేశంలో తీవ్రతరం కాకుండా ముందుగానే విదేశాల నుండి వచ్చిన వారిని టెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు.

అయితే ఆర్.టి.

పి.సి.

ఆర్ టెస్ట్ రావడానికి టైం పడుతుంది.అందుకే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిక రీసర్చ్ (ఐ.

సి.ఎం.

ఆర్) లోని నేషనల్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగం ఆర్టీ లాంప్ (RT Lamp)కొవిడ్ కిట్ ను ఆవిష్కరించింది.

నిపుణుల అవసరం లేకుండానే ఈ కిట్ తో కరోనా టెస్ట్ చేయవచ్చని చెబుతున్నారు.

అంతేకాదు ఈ టెస్ట్ రిజల్ట్ కేవలం 30 నిమిషాల్లో వచ్చేస్తుందని వెల్లడించారు.ఆర్టీ లాంప్ 100 శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని ఐ.

సి.ఎం.

ఆర్ ప్రతినిధులు చెబుతున్నారు.అంతేకాదు ఇతర కొవిడ్ టెస్ట్ ల కన్నా ఈ ఆర్.

టి.లాంప్ టెస్ట్ 40 శాతం తక్కువ ఖర్చు అవుతుందని వెల్లడించారు.

ఢిల్లీ, చెన్నైలోని పలు కంపెనీలకు నమూనాలు పంపించడం జరిగిందని.వీటిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అన్నారు.

రెండు వారాల్లో ఈ కొత్త కిట్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.ఈ కొత్త కొవిడ్ పై ఇంకా మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.

 ఈ సరికొత్త కొవిడ్ టెస్ట్ కిట్ ద్వారా ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Former Minister KTR : రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు..: కేటీఆర్