అశ్విన్ ని ఆకాశానికెత్తేసిన ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు.. ఆ రూల్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నాడని కితాబు!

రవిచంద్రన్ అశ్విన్ గురించి తెలియని నేటి తరం క్రికెట్ క్రీడాభిమానులు ఉండరనే చెప్పుకోవాలి.

ముఖ్యంగా అతని బౌలింగ్ శైలికి పిచ్చ ఫ్యాన్స్ వున్నారు.2019వ సీజన్‌లో జోస్ బట్లర్, మన్కడింగ్ విధానం ద్వారా రనౌట్ చేసి, సంచలనం సృష్టించాడు రవిచంద్రన్ అశ్విన్.

ఇంతకుముందు కపిల్ దేవ్‌తో సహా చాలామంది ఈ విధానంలో బ్యాట్స్ మెన్ ను అవుట్ చేసినప్పటికీ, అశ్విన్ చేసిన పనిని చాలామంది మాజీ క్రికెటర్లు విమర్శించడం మనకు విదితమే.

ఆ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని చాలామంది ట్రోల్ చేశారు కూడా.

ఈ నేపథ్యంలో తాను చేసిన పని, క్రికెట్ రూల్‌కి ఎంతమాత్రమూ విరుద్ధం కాదని అశ్విన్ వాదించాడు.

అయితే అశ్విన్ వాదనను నిజం చేస్తూ ‘మన్కడింగ్’ని క్రికెట్ పుస్తకంలో అఫిషియల్ రనౌట్‌గా చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ICC.

దాంతో అశ్విన్‌ పనిని తప్పని వాదించిన సో కాల్డ్ మాజీలు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా IPL 22 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్, రిటైర్ అవుట్‌గా పెవిలియన్ చేరిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసి ఔరా అనిపించాడు.

"""/" / ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి లోనైయేలా చేసింది.

సాధారణంగా బౌలర్లు, లైన్ మీద కాలు పెట్టి బౌలింగ్ చేస్తారు.ఒకవేళ లైన్ దాటినట్లయితే నో బాల్‌గా అదనపు పరుగును సమర్పించుకోవలసిందే.

అయితే అవ్విన్ కి ఆ గతి ఎప్పటికీ పట్టదు.ఎందుకంటే, ఇతగాడు లైన్‌కి చాలా దూరం నుంచి బౌలింగ్ చేస్తూ కనిపిస్తాడు.

ఈ విషయాన్నే ఉటంకిస్తూ."క్రికెట్ అనేది ఖచ్చితంగా 22 గజాల మధ్యలో ఆడాలనే ఏమి లేదు.

రవి అశ్విన్ చూడండి.కొత్త పద్ధతి కనిపెట్టాడు.

గాల్లో బంతి మరింత సమయం ఉండేందుకు ఎక్స్‌ట్రా అవకాశం ఇస్తున్నాడు.నేటి క్రికెట్ క్రీడలో కొత్త కొత్త మార్గాలను కనుక్కుంటూ వెళ్లడం చాలా అవసరం!" అంటూ ట్వీట్ చేసింది ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు.