ఐస్ క్యూబ్స్‌తో మొటిమ‌ల‌కు చెక్‌.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

ఐస్ క్యూబ్స్‌తో మొటిమ‌ల‌కు చెక్‌ మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

యుక్త వ‌య‌సు రాగానే ప్రారంభం అయ్యే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో మొటిమ‌ల‌దే మొద‌టి స్థానం.

ఐస్ క్యూబ్స్‌తో మొటిమ‌ల‌కు చెక్‌ మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

ఈ మొటిమ‌లు రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.హార్మోన్ల లోపం, జంక్ ‌‌‌‌ఫుడ్‌‌‌‌, ఆయిల్ ఫుడ్‌, కాలుష్యం ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల మొటి‌మల స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

ఐస్ క్యూబ్స్‌తో మొటిమ‌ల‌కు చెక్‌ మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

ఇక ఈ మొటిమ‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.వేల‌కు వేలు ఖ‌ర్చు చేసి ర‌క‌ర‌కాల క్రీములు వాడుతుంటారు.

అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఐస్ క్యూబ్స్‌తో కూడా మొటిమ‌ల‌ను నివారించుకోవ‌చ్చు.గ్రీన్ టీని ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచి గడ్డకట్టేలా చేయాలి.

ఆ త‌ర్వాత ఐస్ క్యూబ్స్‌ను తీసుకుని మొటిమ‌లు ఉన్న ప్రాంతంలో మెల్ల మెల్ల‌గా రుద్దుతూ అప్లై చేయాలి.

ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేస్తే మొటిమ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

అయితే ఐస్ క్యూబ్స్ డైరెక్ట్ గా ఉపయోగించడం ఇబ్బందికరమైతే.ఒక కాట‌న్ క్లాత్‌లో వేసి అప్లై చేసినా మొటిమ‌లు త‌గ్గుతాయి.

ఇక మొటిమ‌ల‌నే కాదు.ఐస్ క్యూబ్స్‌తో మ‌రిన్ని సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

"""/"/ ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై ర‌ద్దుతూ అప్లై చేయ‌డం వ‌ల్ల రక్త ప్రసరణ మెరుగుప‌డుతుంది.

ఫ‌లితంగా చ‌ర్మంపై ముడ‌త‌లు, గీత‌లు పోయి.ముఖ్యంగా య‌వ్వ‌నంగా మ‌రియు తాజాగా క‌నిపిస్తుంది.

అలాగే క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఉన్న వారు.ఐస్ క్యూబ్స్‌ను ఒక క్లాత్‌లో వేసి క‌ళ్ల చుట్టూ రుద్దాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల న‌ల్ల‌టి వ‌ల‌యాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాటు కంటి అల‌స‌ట కూడా త‌గ్గుతుంది.

"""/"/ అదేవిధంగా, ఐస్ క్యూబ్స్‌తో మసాజ్ చేయడం వల్ల చర్మాన్ని టైట్ గా మ‌రియు కాంతివంతంగా మెరుస్తుంది.

అలాగే నార్మ‌ల్ వాట‌ర్‌లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఐస్ క్యూబ్ లను తయారు చేసుకోవాలి.

ఈ రోజ్ వాటర్ ఐస్ క్యూబ్ లకు క్లాత్‌లో వేసి.చ‌ర్మంపై మెల్ల మెల్ల‌గా రుద్దుతూ మ‌సాజ్ చేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌లినాలు పోయి.ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తుంది.