ఎముక‌లను దృఢ‌ప‌రిచే తాటిముంజ‌లు.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా..?

నేటి ఆధునిక కాలంలో మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చిన్న వ‌య‌సు వారిలోనే ఎముకలు బ‌ల‌హీనంగా, పెలుసుగా మారుతున్నాయి.

దాంతో త‌ర‌చూ కీళ్ల నొప్పులు, చిన్న చిన్న దెబ్బ‌ల‌కు ఎముక‌లు విర‌గ‌డాలు జ‌రుగుతుంటాయి.

అందుకే ఎముక‌ల‌ను ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.అయితే ఎముక‌ల‌ను బ‌లంగా ఉంచ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

అలాంటి వాటిలో తాటి ముంజ‌ ఒక‌టివేస‌వి కాలంలో మొద‌లైంది.ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా తాటి ముంజ‌లే ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.

వేస‌వి తాపాన్ని తీర్చే తాటి ముంజ‌ల్లో బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

పొటాషియం, క్యాల్షియం, ఐర‌న్‌, ఫైబర్, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విటమిన్ కె, విట‌మిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు తాటి ముంజ‌లో ఉంటాయి.

"""/"/ అందుకే తాటి ముంజ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా ఎముక‌లు బ‌ల‌హీనం, పెలుసుగు ఉన్న వారు, త‌ర‌చూ కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డే వారు ప్ర‌తి రోజు తాటి ముంజ‌ల‌ను త‌గిన మోతాదులో తీసుకోవాలి.

ఇలా చేస్తే తాటి ముంజ‌ల్లో ఉండే కాల్షియం, విట‌మిన్ కె మ‌రియు విట‌మిన్ డి ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్య వంతంగా మారుస్తాయి.

"""/"/ అలాగే తాటి ముంజ‌ల‌ను త‌ర‌చూ తీసుకుంటే శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురి కాకుండా ఉంటుంది.

అధిక ర‌క్త పోటు స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు త‌ర‌చూ తాటి ముంజ‌లు తీసుకుంటే బీపీ కంట్రోల్ ఉంటుంది.

అంతేకాదు, తాటి ముంజ‌ల తీసుకుంటే కంటి చూపు మెరుగుప‌డుతుంది.క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధి వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

చ‌ర్మ స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా కూడా ఉంటాయి.కాబ‌ట్టి, ఈ సీజ‌న్‌లో తాటి ముంజ‌ల‌ను అస్స‌లు మిస్ కాకండి.

రేపటితో ముగియనున్న జగన్ బస్సు యాత్ర… చివరి రోజు షెడ్యూల్..!!