మహిళల 2021 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వాయిదా…!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఎంత ఇబ్బంది పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీంతో కరోనా ను నివారించేందుకు అనేక దేశాలు లాక్ డౌన్ విధానాన్ని పాటించడంతో అనేక రంగాలు పూర్తిగా స్తంభించాయి.

ఇందులో ప్రముఖంగా క్రీడా రంగం కూడా పూర్తిగా స్తంభించింది.అయితే ఇప్పుడిప్పుడే కొన్ని జాగ్రత్తల నడుమ ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం లో కదలికలు కనిపిస్తున్నాయి.

ముక్యంగా ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లో పదుల సంఖ్యలో అనేక సిరీస్ లు రద్దయ్యాయి, కొన్ని వాయిదా పడ్డాయి.

టీమిండియా కు ఎంతో ముఖ్యమైన ఆసియా కప్, అలాగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

"""/"/ ఇక తాజాగా వచ్చే సంవత్సరం లో జరగవలసిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ కూడా సంవత్సరం రోజులు వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి తెలియజేసింది.

తాజాగా ఈ నిర్ణయంపై టీమిండియా మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు.

ఇలాంటి సమయంలో మనకు కలిసొచ్చే అంశం చూసుకోవాలని, ఒక్క ప్రపంచకప్ వాయిదా పడిన అంతమాత్రాన టైటిల్ సాధించాలనే లక్ష్యం మాత్రం చెక్కుచెదరని మిథాలీ తెలియజేసింది.

అయితే తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మరికొంత సమయం పడుతుందని మీడియా పూర్వకంగా తెలిపింది.

ఇదేం క్రేజ్ బాబు.. భారత్ లో ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం..