ఛాంపియన్ ట్రోఫీ పై కీలక ప్రకటన చేసిన ఐసీసీ.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జట్లు..!

ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐసీసీ ఓ కీలక ప్రకటన చేసి కొన్ని క్రికెట్ జట్లకు ఊహించని షాక్ ఇచ్చింది.

2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి(Champions Trophy ) సంబంధించిన అర్హత ప్రమాణాలతో పాటు విధి విధానాలకు సంబంధించిన ఇంట్రాక్షన్ ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది.

"""/" / 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్( Pakistan ) వేదికగా జరుగనుంది.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొంటాయి.అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత ఏ జట్లకు ఉంటుందంటే.

ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో తొలి ఏడు స్థానాలలో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయని ఐసీసీ పేర్కొంది.

"""/" / అయితే 2023 వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించని జట్లు వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఈ విషయంపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఐసీసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే ఆతిథ్య పాకిస్తాన్ జట్టు టాప్-7 లో ఉంటే ఎనిమిదవ జట్టును ఏ విధంగా ఎంపిక చేస్తారనే దానిపై మాత్రం ఐసీసీ ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీను రెండేళ్లకు ఒకసారి ఐసీసీ నిర్వహిస్తుంది.ఇప్పటివరకు ఎనిమిది ఎడిషన్స్ నిర్వహించింది.

2017లో ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ చివరిది.2017లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్-పాక్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో పాకిస్తాన్ ట్రోఫీ కైవసం చేసుకుంది.

ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ