Yogesh Patil : తండ్రి స్కూల్ టీచర్.. పదేళ్ల కష్టంతో ఐఏఎస్.. ఈ యువకుడి సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!
TeluguStop.com
మారుమూల పల్లెటూరులో కెరీర్ ను మొదలుపెట్టి ఐఏఎస్ గా సక్సెస్ సాధించిన యోగేష్ పాటిల్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.
2020 సంవత్సరంలో యోగేష్ పాటిల్( Yogesh Patil ) ఐఏఎస్ గా ఎంపికయ్యారు.
యోగేష్ తండ్రి స్కూల్ టీచర్ గా పని చేసేవారు.యోగేష్ పాటిల్ గ్రామాల్లోనే చదువుకున్నారు.
యోగేష్ పాటిల్ సక్సెస్ స్టోరీ వెనుక పదేళ్ల కష్టం ఉంది.2010 సంవత్సరంలో యోగేష్ సివిల్స్ దిశగా అడుగులు వేశారు.
2020 సంవత్సరానికి యోగేష్ పాటిల్ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని సొంతం చేసుకున్నారు.పదో తరగతి చదివే సమయంలో యోగేష్ పాటిల్ ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం అడుగులు వేశారు.
మరాఠీ మీడియంలోనే స్కూలింగ్ ను పూర్తి చేసిన యోగేష్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేశారు.
ఆ తర్వాత పుణేలో యోగేష్ మెకానికల్ ఇంజనీరింగ్ ను పూర్తి చేయడం గమనార్హం.
"""/" /
బీటెక్ పూర్తైన తర్వాత యోగేష్ ఢిల్లీ( Delhi )కి సివిల్ ప్రిపరేషన్ కు వెళ్లారు.
తొలి ప్రయత్నంలోనే యోగేష్ 231వ ర్యాంక్ ను సాధించడం గమనార్హం.ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో యోగేష్ పాటిల్ మరోసారి పరీక్ష రాసి ఆల్ ఇండియా స్థాయిలో 63వ ర్యాంక్ సాధించారు.
కలను సాకారం చేసుకుని యోగేష్ పాటిల్ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచి ప్రశంసలు అందుకోవడంతో పాటు కెరీర్ పరంగా ఎదిగారు.
"""/" /
మెకానికల్ ఇంజనీరింగ్( Mechanical Engineering ) చదివిన యోగేష్ పాటిల్ ఆంత్రోపాలజీని ఆప్షనల్ గా ఎంచుకున్నారు.
ఈ సబ్జెక్ట్ కు సంబంధించి జాతీయ స్థాయిలో ఎక్కువ మార్కులు సాధించిన నాలుగో వ్యక్తి యోగేష్ పాటిల్ కావడం గమనార్హం.
లోతైన సమాధానాలు, ఆలోచింపజేసే సమాధానాలు రాస్తే సివిల్స్ లో విజయం సాధించవచ్చని యోగేష్ పాటిల్ చెబుతున్నారు.
యోగేష్ పాటిల్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.యోగేష్ పాటిల్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఓజీ సినిమాలో పాట పాడుతునందుకు రమణ గోగుల తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?