ప్రస్తుతం ఐఏఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?
TeluguStop.com
జగన్ అధికారంలోకి రాగానే చేసిన పనుల్లో ముఖ్యమైనది.తనతోపాటు తన అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకున్న వాళ్లకు, కష్టాల్లో తన వెంట ఉన్న వాళ్లకూ కీలకమైన పదవులు కట్టబెట్టడం.
ఇలా ఎంతో మంది ఐఏఎస్ అధికారులు, తన మీడియాలో పని చేసిన వాళ్లను తెచ్చి ప్రభుత్వంలో పెట్టుకున్నారు.
ఇదే అక్రమాస్తుల కేసులో తనలాగే జైలుకు వెళ్లి వచ్చిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కూడా సీఎంవోలోకి తీసుకురావడానికి జగన్ చాలా ప్రయత్నాలే చేస్తున్నారు.
"""/" /సస్పెన్షన్ పూర్తయిన తర్వాత ఆమెను తెలంగాణ కేడర్‌కు నియమించారు.అయితే ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే ఇక్కడికి వచ్చేయాలని శ్రీలక్ష్మి ఆసక్తి చూపించారు.
జగన్ కూడా వెంటనే ఓకే చెప్పారు.ఇదే ప్రతిపాదనను కేసీఆర్ ముందు పెడితే.
ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే కేంద్ర ప్రభుత్వమే ఇప్పటికీ శ్రీలక్ష్మి విషయంలో ఎటూ తేల్చడం లేదు.
ఆమెపై ఇంకా సీబీఐ కేసులు ఉన్నందున అంతర్రాష్ట్ర బదిలీ కుదరదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చి చెబుతోంది.
అయినా జగన్, విజయసాయిరెడ్డి మాత్రం పట్టువీడటం లేదు.ఆమెను ఎలాగైనా ఏపీకి తెచ్చుకోవడానికి కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
తాజాగా పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన విజయసాయి.మరోసారి శ్రీలక్ష్మిని వెంటబెట్టుకొని మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు.
"""/" /ఇటు శ్రీలక్ష్మి తెలంగాణలో పని చేయడం ఇష్టం లేక ఆరు నెలలుగా సెలవు పెట్టి ఢిల్లీలోని ఏపీ భవన్‌లోనే మకాం వేశారు.
ఆమె అక్కడ ఉండటానికి కావాల్సిన ఖర్చులన్నింటినీ ఏపీ భవన్ అధికారులే భరిస్తున్నారు.ఎలాగూ ఢిల్లీలోనే ఉంది కదా అని అక్కడ వైసీపీ పనులన్నింటినీ శ్రీలక్ష్మే దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఒకరకంగా విజయసాయి చేయాల్సిన పనులన్నింటినీ ఆమె చేత చేయిస్తున్నారు.తెలంగాణ కేడర్‌కు చెందిన అధికారిణే అయినా.
అనధికారికంగా ఏపీ ప్రభుత్వానికి, వైసీపీకి శ్రీలక్ష్మి పని చేస్తుండటం గమనార్హం.ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి.