మూడేళ్లు మొబైల్ కు దూరంగా ఉంటూ ఐఏఎస్.. నేహా బైద్వాల్ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

ఐఏఎస్( IAS ) లక్ష్యాన్ని సాధించడం వెనుక ఎంతో కష్టం ఉంటుంది.ప్రస్తుత కాలంలో మన జీవితంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది.

స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియాను వాడకుండా గంట సమయం కూడా గడపలేని స్థితిలో చాలామంది ఉన్నారు.

మరోవైపు దేశంలోని కఠినమైన పరీక్షలలో యూపీఎస్సీ( UPSC ) ఒకటి కాగా నేహా బయద్వాల్ మూడేళ్లు మొబైల్ కు దూరంగా ఉండి తను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో నైహా బైద్వాల్( Neha Byadwal ) జన్మించారు.

భోపాల్ లో హైస్కూల్ విద్యను పూర్తి చేసిన నేహ యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన తర్వాత యూపీఎస్సీపై దృష్టి పెట్టారు.

తొలి మూడు ప్రయత్నాల్లో యూపీఎస్సీ పరీక్షలో ఆమెకు ఆశించిన ఫలితాలు రాలేదు.ఆ తర్వాత మొబైల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీకు దూరంగా ఉంటూ నేహా బైద్వాల్ లక్ష్యంపై దృష్టి పెట్టారు.

"""/" / 2021 సంవత్సరంలో నాలుగో ప్రయత్నంలో నేహా బైద్వాల్ కు ఆశించిన ఫలితాలు వచ్చాయి.

నేహా బైద్వాల్ ఆలిండియా స్థాయిలో 569వ ర్యాంక్ సాధించారు.24 సంవత్సరాల వయస్సులోనే లక్ష్యాన్ని సాధించడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.

యూవీఎస్సీ సివిల్ సర్వీసెస్( UPSC Civil Services ) పరీక్షలో మొత్తం ఆమెకు 960 మార్కులు వచ్చాయి.

సోషల్ మీడియాలో సైతం నేహా బైద్వాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. """/" / నేహా బైద్వాల్ కు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 28 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

నేహా బైద్వాల్ భవిష్యత్తులో మరిన్ని భారీ లక్ష్యాలను సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

యూపీఎస్సీ ప్రిపేర్ కావాలని భావించే వాళ్లు నేహను స్పూర్తిగా తీసుకోవచ్చు.ఆమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

నేహా బైద్వాల్ టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఆమెకు ఎవరూ సాటిరారంటూ కామెంట్లు చేస్తున్నారు.

నేడు టిడిపి లోకి ఆళ్ల నాని ? జగన్ సన్నిహితులంతా ఎందుకిలా ?