సివిల్స్ సాధించి సేవాభావంతో వేలమంది ఆకలి తీరుస్తున్న ధాత్రి రెడ్డి.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

సాధారణంగా ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడిన వాళ్లలో చాలామందికి సేవా కార్యక్రమాలు చేయాలనే భావన ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వెనుకడుగు వేస్తూ ఉంటారు.

అయితే ఐఏఎస్ ధాత్రిరెడ్డి( IAS Dhatri Reddy ) మాత్రం ఇతరులకు ఎంతో భిన్నమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఉద్యోగం చేస్తే జీతం మాత్రమే వస్తుందని జీవితాలను మార్చే పని చేస్తే సంతృప్తి కలుగుతుందని ధాత్రి రెడ్డి భావించారు.

"""/" / విద్యార్థి దశ నుంచి సేవా భావాన్ని కలిగి ఉన్న ధాత్రికి భర్త సపోర్ట్ కూడా తోడు కావడంతో ఆమె తన లక్ష్యాన్ని సులువుగానే సాధించగలిగారు.

తన సక్సెస్ స్టోరీ గురించి, సేవా కార్యక్రమాల గురించి ధాత్రి రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి జిల్లా( Yadadri District ) గుండ్లబావిలో తాను జన్మించానని అన్నారు.

విద్యార్థి దశలో ఉన్న సమయంలో ఆకలి, పేదరిక నిర్మూలన, ప్రజా చైతన్యం గురించి ఆలోచించానని ఆమె చెప్పుకొచ్చారు.

"""/" / తాను ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివానని ఒకవైపు ఆహారం వృథా అవుతుండగా మరోవైపు ఆకలితో అలమటిస్తున్న పేదలను చూసి నాకు బాధ కలిగిందని ధాత్రి రెడ్డి పేర్కొన్నారు.

2016 సంవత్సరంలో ఫ్రెండ్స్ తో కలిసి ఫీడ్ ఇండియా( Feed India ) అనే ఎన్జీవోను మొదలుపెట్టానని ఆమె తెలిపారు.

హోటళ్లు, మెస్ లలో వృథా అవుతున్న ఆహారాన్ని ఫుట్ పాత్ లు, ఇతర ప్రదేశాల్లో ఉండే పేదలకు ఫ్రీగా అందించే వాళ్లమని ధాత్రి పేర్కొన్నారు.

ఒక యాప్ ను రూపొందించి యాప్ సహాయంతో వేల మంది ఆకలి తీర్చానని ఆమె అన్నారు.

భర్త ప్రతాప్ శివకిశోర్ నుంచి నాకు సహకారం అందిందని ఆమె చెప్పుకొచ్చారు.అనకాపల్లిలో తాను సహాయ కలెక్టర్ గా పని చేశానని ధాత్రి రెడ్డి తెలిపారు.

ది బెటర్ ఇండియా సంస్థ నుంచి ఉత్తమ ఐఏఎస్ గా అవార్డ్ వచ్చిందని ధాత్రి చెప్పుకొచ్చారు.

బాలయ్య ఈ 7 ఏళ్ల లో ఆ ఒక్క సినిమా విషయం లోనే డేరింగ్ డిసిజన్ తీసుకున్నాడా..?