నేను ఇంకా హీరోయిన్ గానే చేస్తా అంటున్న ఆ నటి

7/జి బృందావన్ కాలనీ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి సోనియా అగర్వాల్.

మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేసుకున్న ఈ అమ్మడుకి తరువాత ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.

తరువాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేసింది.సక్సెస్ లు పెద్దగా లేకపోవడంతో దర్శకుడు సెల్వ రాఘవన్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది.

తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.ఆ తరువాత మరల సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కూడా హీరోయిన్ పాత్రలు మాత్రం ఈ భామకి రావడం లేదు.

ఏదో అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెట్టుకొస్తోంది.అయితే ఈ మధ్య సోనియా అగర్వాల్ ని ఏకంగా హీరో, హీరోయిన్స్ తల్లి పాత్రల కోసం ఎక్కువగా దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారు.

చిన్న వయస్సులోనే తనకి తల్లిపాత్రలు ఆఫర్ చేయడంపై సోనియా అగర్వాల్ కాస్తా అసహనం వ్యక్తం చేసింది.

పలు సినిమాల్లో నటించి, మెప్పించిన హీరోయిన్ సోనియా అగర్వాల్ తాజాగా ఒక విషయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

తనను అమ్మ పాత్రల్లో నటించమని దర్శకనిర్మాతలు అడుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది.తాను, నయనతార, త్రిష ముగ్గురం ఒకేసారి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించామని, కానీ తనను మాత్రమే అమ్మ పాత్రలు చేయమని అడుగుతున్నారని, వాళ్లను ఎందుకు అడగడం లేదని ప్రశ్నించింది.

తాను ఇప్పటికీ ఎంతో ఫిట్ గా ఉన్నానని, హీరోయిన్ పాత్రలు చేసేంత గ్లామర్ తనలో ఉందని చెప్పింది.

రాధిక, ఖుష్బూల మాదిరి వయసు పెరిగిన తర్వాత అమ్మ పాత్రల్లో నటిస్తానని తెలిపింది.

ఇప్పట్లో తాను అమ్మ పాత్రల్లో నటించబోనని చెప్పింది.అయితే త్రిష, నయనతార అంటే స్టార్ హీరోయిన్స్ గా వరుస విజయాలతో ఆ రేంజ్ ని అందుకున్నారు.

అందుకే ఇప్పటికే వారికి హీరోయిన్ పాత్రలే వస్తున్నాయి.అయితే సోనియా అగర్వాల్ మాత్రం ఓ విధంగా ఫేడ్ అవుట్ హీరోయిన్.

మరి ఈ హీరోయిన్ త్రిష, నయనతార తరహాలో తనకి కూడా మెయిన్ హీరోయిన్ పాత్రలే కావాలని అసాగడం కాస్తా అతిగానే అనిపిస్తుందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

ఆ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ రియల్ కాదా.. అదంతా సీజీ మహిమానా??