బీజేపీ పార్టీని వీడను:కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా: తాను బీజేపీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ మీడియాలో దుష్ప్రచారంచేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాననిమునుగోడు మాజీ ఎమ్మెల్యే,బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy ) స్పష్టం చేశారు.

గురువారం మునుగోడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఫలితాలను చూపి తనను కాంగ్రెస్ మిత్రులు పార్టీలోకి రమ్మంటున్నారని,అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ గెలవాలని ఏముందన్నారు.

కర్ణాటకలో పరిస్థితులు, తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు.తెలంగాణలో బీఆర్ఎస్‌( BRS Party 0 9కు బీజేపీనే నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అని అన్నారు.

తనను రాజకీయంగా ఎదుర్కోలేక పార్టీ మారుతానంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారనిఆరోపించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా 25 వేల కాంట్రాక్టు అంటూ తనపై రేవంత్ రెడ్డి( Revanth Reddy ), బీఆర్ఎస్ లు తప్పుడు ప్రచారం చేయించి తనను ఓడించేందుకు కుట్ర చేశారని గుర్తు చేశారు.

నేటి నుంచే అమరావతి పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న చంద్రబాబు