విలువలు లేని రాజకీయాలు చేయను.. హరీశ్ రావు కామెంట్స్

పదవుల కోసం విలువలు లేని రాజకీయాలు చేయనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) అన్నారు.

సిద్ధిపేట లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు.రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ముఖ్యమంత్రి అయ్యాడంటే సిద్ధిపేట పుణ్యమేనని హరీశ్ రావు పేర్కొన్నారు.

సిద్ధిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదన్న ఆయన అభివృద్ధి అంతా మెదక్ లోనే జరిగిందని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు.

కానీ ఇప్పుడు మెదక్, సిద్ధిపేటలో బీఆర్ఎస్( BRS ) చేసింది ఏమీ లేదని అంటున్నారని తెలిపారు.

ఈ క్రమంలోనే పదవుల కోసం విలువలు లేని రాజకీయాలు చేయనని చెప్పారు.ప్రజలకు మంచి జరగడమే తనకు ముఖ్యమన్న హరీశ్ రావు పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే తాను చేసిన సవాల్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలన్నారు.

ఆరు గ్యారంటీలు( Six Guarantees ) అమలు చేస్తామని బాండు పేపర్ రాసిచ్చారన్న హరీశ్ రావు వంద రోజుల్లో అమలు చేస్తామన్న బాండు పేపర్లు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు.

గాలి ప్రామిస్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు.ఆగస్ట్ 15 లోపు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానన్నారు.

ఒకవేళ హమీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని నిలదీశారు.

రష్మికను కూడా అరెస్టు చేసి లోపలేయ్యండి… బన్నీ కేసులో ఊహించని ట్విస్ట్?