ఒక సినిమా ఫ్రీగా చేస్తా...అది మాత్రం అసలు అడగవద్దు పవన్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఇండస్ట్రీలో ఈయనకు ఆప్తమిత్రుడు అత్యంత సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్న అనుబంధం గురించి మనకు తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ఎవరి మాట అయినా వింటారు అంటే అది త్రివిక్రమ్ మాటని చెప్పాలి.

ఈ విధంగా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంది.ఇలా వీరిద్దరిని విడదీయడం, విడదీసి చూడటం ఎవరి తరం కాదు.

ఇక వీరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ఎన్నో సార్లు బహిరంగంగా వెల్లడించారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అన్ని విషయాలలో ఒకే విధంగా ఉంటుంది కానీ ఒక విషయంలో మాత్రం మా ఇద్దరి మధ్య తేడాలు, విభేదాలు వస్తాయని పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

"""/" / ఇక వీరిద్దరి మధ్య ఏ విషయంలో తేడా వస్తుందనే విషయానికి వస్తే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పుస్తకాల పురుగు.నేను కూడా పుస్తకాలు ఎక్కువగా చదువుతాను.

ఇలా ఇద్దరం పుస్తకాల పురుగులమే.అయితే నా దగ్గర ఉన్న పుస్తకాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఒక పుస్తకం ఎంతో నచ్చింది.

ఆ పుస్తకం తనకు కావాలని త్రివిక్రమ్ అడిగితే తనకు ఒక సినిమా అయినా ఫ్రీగా చేసి పెడతాను కానీ ఆ పుస్తకం మాత్రం అడగొద్దని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రస్తుతం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అనుష్క-ఎన్టీఆర్‌ల మధ్య పెద్ద గొడవ.. అందుకే ఒక్క సినిమా కూడా చేయలేదు..?