ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా..: పురంధేశ్వరి
TeluguStop.com
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో తాము జనసేనతో పొత్తులో ఉన్నామని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చెప్తున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు.టీడీపీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు.
తాను ఫలానా చోట పోటీ చేస్తానని అడగలేదన్న పురంధేశ్వరి పార్టీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
జనసేనతో పొత్తుతోనే తాము ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నామని తెలిపారు.తాజాగాబ పురంధేశ్వరి వ్యాఖ్యలతో ఏపీలో జనసేన - బీజేపీ -టీడీపీ పొత్తు అంశం చర్చనీయాంశంగా మారింది.
అల్లు అర్జున్ అరెస్ట్ కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి.. భార్యను ఓదార్చిన బన్నీ!