చిరంజీవి ముందుకు వెళ్లి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పాను.. చిరంజీవి రియాక్షన్ అదే

ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ నటుడు మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

కేవలం యాక్టింగ్ లో మాత్రమే కాకుండా చదువులో కూడా మానస్ టాపర్.నటన పై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి గతంలో తనకి మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య జరిగిన ఒక సన్నివేశం గురించి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ముందు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో భాగంగా మానస్ తన స్కూల్ డేస్ గురించి మాట్లాడారు.

స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారని చెప్పడంతో చాలా ఎక్సైట్ గా ఫీలయ్యాము.

అందుకోసమే యాన్వల్ డే కోసం ఎంతో ఎదురు చూశామని తీరా చూస్తే మెగాస్టార్ చిరంజీవి రాలేదని చెప్పి అందరినీ ఎంతో డిసప్పాయింట్ చేశారంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అదే సమయంలోనే అతను స్కూల్ డైరెక్టర్ గారు ఎవరైతే స్కూల్ టాపర్ గా ఉంటారో వారిని చిరంజీవి గారికి పరిచయం చేస్తానని చెప్పారు.

ఇక ఎలాగైనా చిరంజీవి గారిని కలవాలని ఉద్దేశంతో ఎంతో కష్టపడి టాపర్ గా నిలిచానని మానస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన స్కూల్ డైరెక్టర్ నుంచి మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి వెళ్లాలని ఫోన్ రావడంతో ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను.

ఇక అప్పట్లో ప్రతి ఒక్కరు మధ్యలో పాపిడి తీసుకొని లాంగ్ హెయిర్ స్టైల్ ఫ్యాషన్ గా ఉండేది.

మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి వెళ్తున్నాను అంటే నానా హంగామా చేశాను ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి పద్మాలయ స్టూడియోలో అందరివాడు సినిమా షూటింగ్ లో ఉన్నారని ఈ సందర్భంగా మానస్ తెలిపారు.

ఇక పద్మాలయ స్టూడియోకి వెళ్ళగానే అమ్మాయిలు ఒక వైపు ఉండగా మనం ఒక చోట తిన్నగా ఉండకుండా స్టూడియో మొత్తం తిరుగుతుంటే లొకేషన్ లో ఒక వ్యక్తి ఎవరు మీరు? ఏంటి ఇక్కడ? అంటూ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఇలా స్కూల్ నుంచి చిరంజీవి గారిని కలవడానికి వచ్చాము అని సమాధానం చెప్పాను.

మరి ఈ జుట్టు ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ అంటూ సమాధానం చెప్పానని తెలిపారు.

"""/" / లోపల ఒక ఫైట్ యాక్షన్ సన్నివేశం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేము బయట చిరంజీవి గారిని కలవడం కోసం ఎంతో ఎదురు చూస్తున్నామని అదే సమయంలో మెగాస్టార్ రావడంతో మా డైరెక్టర్ సార్ అందరిని పిలిచారు.

అలా మెగాస్టార్ నడుచుకుంటూ వస్తుంటే సార్ ఉన్నారన్న విషయం కూడా మరిచిపోయి గట్టిగా కేకలు వేయగా ఆ సమయంలో సార్ మమ్మల్ని ఒక చూపు చూడటంతో సైలెంట్ అయ్యాము.

ఇక ముందుగా సార్ మమ్మల్ని కాకుండా గర్ల్స్ ని పరిచయం చేశారు.తర్వాత నన్ను చూపిస్తూ ఇతడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు అంటూ తన గురించి చెప్పడంతో ఒక్కసారిగా చిరంజీవి ఫేస్ రియాక్షన్స్ మారిపోయాయని చెప్పారు.

అలా చిరంజీవి గారు నాతో మాట్లాడుతున్న సమయంలో ఇంతకు ముందు ఇక్కడ మీకేం పని అని అడిగిన వ్యక్తి అలా చిరంజీవి గారి పక్కన వచ్చి ఈయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అట సార్ అని చెప్పారు.

ఆ మాట వినగానే ఒక్కసారిగా భయం వేసింది.ఇక ఆ మాట విన్న మెగాస్టార్ చిరంజీవి నవ్వుతూ పర్లేదు మా తమ్ముడు ఫ్యాన్ కదా అంటూ అన్నారని ఇప్పటికీ ఆ సన్నివేశం ఎంతో బాగా గుర్తు ఉందని ఈ ఇంటర్వ్యూలో మానస్ తెలిపారు .

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?