ప్రేమ కథ చిత్రం అనుకున్న… థ్రిల్లర్ సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయా: సాయి ధరమ్ తేజ్

మెగా హీరో,మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)చాలా రోజుల తర్వాత విరూపాక్ష సినిమా(Virupaksha Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

బైక్ ప్రమాదం తర్వాత ఈయన మొదటిసారిగా విరూపాక్ష సినిమాలో నటించారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం చిత్ర బృందం హైదరాబాదులో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

"""/" / విరూపాక్ష సినిమాకు కార్తీక్ దండు(Karthik Dandy) అనే డైరెక్టర్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా సంయుక్త మీనన్(Samyuktha Menon) నటించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికి విడుదలైనటువంటి పాటలు పోస్టర్స్ ట్రైలర్ కనుక చూస్తే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలను తెలియచేశారు.

ఈ సినిమా కథ 2019వ సంవత్సరంలోనే సుకుమార్ గారు తనకు వినమని చెప్పారని తెలిపారు.

"""/" / ఇక ఈ కథ తాను ప్రేమ కథ చిత్రం అయ్యుంటుంది అనుకున్నాను కానీ కార్తీక్ వచ్చి థ్రిల్లర్ సినిమా (Thriller Movie)అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు.

ఈ స్టోరీ విన్న తర్వాత ఈ సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అవుతుందని ఫిక్స్ అయ్యి ఈ సినిమాకు ఒప్పుకున్నానని సాయిధరమ్ తేజ్ వెల్లడించారు.

ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని దీమా వ్యక్తం చేశారు.ఇక ఈ సినిమాకు ఎన్టీఆర్(NTR) వాయిస్ ఓవర్ ఇవ్వడం మనకు తెలిసిందే.

అయితే ఈ విషయం గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అన్న ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయిందని తెలిపారు.

ఇలా తన సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ఎన్టీఆర్ కి ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

మరి విరూపాక్ష ద్వారా సాయి ధరమ్ తేజ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి4, మంగళవారం 2025